News July 25, 2024
రేపు కూడా వర్షాలు

ఏపీలోని మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో రేపు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి.
Similar News
News November 22, 2025
MDK: రూ.లక్ష ఆదాయం వస్తుంది..!

సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మల్బరీ తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పట్టుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, రైతులు కొద్దిగా కష్టపడితే ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రభుత్వాలు అందిస్తోన్న ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వర్ రావు తెలిపారు.
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలి?

భార్యాభర్తల్లో ఎవరైనా ఈ వ్రతం చేయవచ్చు. మొదటి వారం శ్రీనివాసుడి చిత్రపటం/విగ్రహాన్ని అలంకరించి, వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చెప్పాలి. కోరిన కోర్కెలు నెరవేరితే 7 కొండలు ఎక్కుతామని ముడుపు కట్టాలి. 7 వారాల పాటు 7 వత్తుల దీపం వెలిగించాలి. పూజ ఎలాగైనా చేయవచ్చు. శనివారాల్లో మద్యమాంసాల్ని ముట్టుకోకూడదు. చివరి వారం వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి. వీలున్నప్పుడు తిరుపతి వెళ్లి ముడుపు సమర్పించాలి.
News November 22, 2025
దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు!

దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాలాలను బట్టి ఎండ, వానలు, చలి అన్నీ ఎక్కువగానే ఉంటున్నాయి. ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య 273 రోజుల్లో 270 రోజులు తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. ఈ ప్రభావంతో దేశంలో 4 వేల మందికి పైగా చనిపోయారని, 2.34 కోట్ల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని పేర్కొంది.


