News March 2, 2025
సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఉంటేనే బెటర్!

భారత్ ఇవాళ NZపై గెలిస్తే ఆస్ట్రేలియాతో, ఓడితే సౌతాఫ్రికాతో సెమీఫైనల్లో తలపడనుంది. అయితే సెమీస్లో ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా ఉంటేనే INDకు మంచిదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 2007 టీ20 WC సెమీస్, 2011 వన్డే WC క్వార్టర్ ఫైనల్లో ఇదే జరిగిందని, ఆ టోర్నీల్లో AUSను ఓడించి కప్ కొట్టామని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ కంగారూలు ఫైనల్కు వస్తే ఆ జట్టును ఓడించడం చాలా కష్టమంటున్నారు. మీ కామెంట్?
Similar News
News November 11, 2025
మంగళవారం రోజున ఇలా చేయకపోవడం ఉత్తమం

మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈరోజు మద్యం, మాంసాహారం, మత్తు పదార్థాలు సేవించకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. మంగళ దోషం తొలగిపోయే ఈరోజున బిచ్చగాళ్లు, పేదలు, వికలాంగులు, వృద్ధులను అవమానించకూడదని అంటున్నారు. ‘తల్లి, సోదరి, భార్య సహా స్త్రీలను దైవస్వరూపంగా భావించాలి. శివుడిని గౌరవించాలి. శివపూజలు చేయాలి. ఈ నియమాలు పాటిస్తే ఆంజనేయుడు తప్పక అనుగ్రహిస్తాడు’ అని సూచిస్తున్నారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర!

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో <<18253113>>పేలుడు<<>>పై కొత్వాలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడిగా అనుమానిస్తూ ఉపా చట్టం సెక్షన్ 16, 18 కింద రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పేలుడు నేపథ్యంలో పలు దేశాల ఎంబసీలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో ఉండొద్దని తమ దేశ పౌరులకు భారత్లోని యూఎస్, ఫ్రాన్స్ ఎంబసీలు అడ్వైజరీ జారీ చేశాయి.
News November 11, 2025
లంకలో హనుమంతుడు ఎడమ కాలు ఎందుకు మోపాడు?

ఆంజనేయుడు, రావణుడి అశుభాన్ని కోరి లంకలో ఎడమ పాదం మోపాడు. దాని ఫలితంగా లంక సర్వనాశనం అయింది. ఎడమ పాదం అశుభాలు, విభేదాలకు దారి తీస్తుంది. దీనికి విరుద్ధంగా, మన సంప్రదాయం ప్రకారం కుడిపాదం మోపి ఇంట ప్రవేశించడం సకల శుభాలకు, సంపదకు ప్రతీక. ముఖ్యంగా కొత్త కోడలు అత్తవారింట కుడి కాలు మోపడం వలన శాంతి, ఉన్నతి, సంతోషం కలుగుతాయి. కాబట్టి, ఇతరుల బాగును, క్షేమాన్ని కోరుతూ ఎల్లప్పుడూ కుడిపాదాన్నే ఉపయోగించాలి.


