News January 12, 2025

పవన్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది: YCP

image

AP: ఆరు నెలల NDA పాలనలో పంచాయతీ రాజ్ శాఖ అనేక మైలు రాళ్లను దాటిందన్న Dy.CM పవన్‌కు వైసీపీ కౌంటరిచ్చింది. ‘అబద్ధాలను ప్రచారం చేయడంలో పవన్ తన గురువు చంద్రబాబును మించిపోయారు. రోడ్ల గుంతలను పూడ్చడానికి కూటమి చేసిన ఖర్చు రూ.860 కోట్లు మాత్రమే. YCP ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి రూ.43వేల కోట్లు, మరమ్మతులకు రూ.4,648 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికైనా పవన్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది’ అని ట్వీట్ చేసింది.

Similar News

News October 24, 2025

ఇతిహాసాలు క్విజ్ – 45 సమాధానాలు

image

1. రావణుడు పుష్పక విమానాన్ని ‘కుబేరుడి’ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాడు.
2. కురు రాజ్యానికి మంత్రి ‘విదురుడు’.
3. ఆంజనేయుడికి గదను ఆయుధంగా ‘కుబేరుడు’ ఇచ్చాడు.
4. లక్ష్మీదేవి ‘క్షీరసాగర మథనం (పాల సముద్రం చిలికినప్పుడు) సమయంలో’ ఆవిర్భవించింది.
5. యమధర్మరాజు సోదరి ‘యమునా దేవీ’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 24, 2025

బస్ ఎక్కకుండా ప్రాణాలు దక్కించుకున్నాడు

image

కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే బస్సులో TGకి చెందిన 15 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో తరుణ్ అనే యువకుడు మాత్రం చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆయన సీట్ నంబర్ U-2లో టికెట్ బుక్ చేసుకున్నారు. HYD ప్యారడైజ్ వద్ద బోర్డింగ్ చేయాల్సి ఉండగా బస్ ఎక్కకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయపడ్డారు. మిగతా 14 మందిలో 8 మంది మరణించారు.

News October 24, 2025

రేపే నాగుల చవితి.. పెళ్లి కానివారు ఇలా చేస్తే?

image

పెళ్లికాని యువతీయువకులకు నాగుల చవితి వివాహ యోగం కల్పిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఈ శుభ దినాన నాగ దేవతను ఆరాధించి, పుట్టలో పాలు పోస్తే.. జాతకంలోని రాహుకేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయని అంటున్నారు. అలాగే వివాహ జీవితానికి ఆటంకం కలిగించే కుజ, కాల సర్ప దోషాలు తొలగి నాగ దేవత అనుగ్రహంతో తగిన జీవిత భాగస్వామి లభిస్తారని పేర్కొంటున్నారు. ☞ మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ వెళ్లండి.