News February 8, 2025
రోహిత్ శర్మ ప్రాక్టీస్ ఆపేస్తే బెటర్: బంగర్

భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ ఆపేస్తే మంచిదని మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. ‘ఏం చేసినా పరుగులు రాని దశను రోహిత్ ఎదుర్కొంటున్నారు. ఇలాంటి దశలో ఆయన సాధన ఆపేయడమే బెటర్. దాని బదులు ఒంటికి విశ్రాంతినిచ్చి తాను అద్భుతంగా ఆడినప్పటి ఇన్నింగ్స్‌ను చూడాలి. అప్పుడెందుకు బాగా ఆడారో అర్థం చేసుకోవాలి. రన్స్ కోసం ఆయన ట్రై చేసే కొద్దీ పరిస్థితి మరింత దిగజారొచ్చు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
కేంద్ర సంస్కృత వర్సిటీలో ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే ఛాన్స్

న్యూఢిల్లీలోని కేంద్ర <
News December 17, 2025
నాగార్జున ‘కేడి’ డైరెక్టర్ కేకే కన్నుమూత

టాలీవుడ్లో విషాదం నెలకొంది. యువ దర్శకుడు కిరణ్ కుమార్(KK) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘కేడి’ మూవీతో దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘KJQ: కింగ్.. జాకీ.. క్వీన్’ షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. విడుదలకు ముందే KK మరణించారు.
News December 17, 2025
రియల్ లైఫ్ ‘జెర్సీ’ మూమెంట్!

మన కెరీర్ క్లోజ్ అనుకున్నప్పుడు లైఫ్ మరో ఛాన్స్ ఇస్తే ఆ ఫీలింగ్‌ను ‘జెర్సీ రైల్వే స్టేషన్ సీన్’ కంటే బాగా ఏదీ చెప్పలేదేమో. తాజా IPL వేలంలో అదే రిపీటైంది. యంగేజ్‌లోనే సచిన్, సెహ్వాగ్, లారాల కాంబోగా గుర్తింపు పొందిన <<18585528>>పృథ్వీషా<<>> ఆ తర్వాత వివాదాలు&ఫామ్ లేక కనుమరుగయ్యారు. టన్నుల కొద్ది డొమెస్టిక్ రన్స్ కొట్టినా సర్ఫరాజ్‌కు స్థానం దొరకలేదు. రీఎంట్రీ కష్టమనుకున్న సమయంలో వీరిని DC, CSK ఆదుకున్నాయి.


