News December 29, 2024

రోహిత్ రిటైర్ కావడం మంచిది: ఆసీస్ మాజీ కెప్టెన్

image

టెస్టుల్లో విఫలమవుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇక రిటైర్ కావడం మంచిదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ వా అన్నారు. తాను కనుక సెలక్టర్ అయితే మెల్‌బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో విఫలమైతే రోహిత్‌కు ఉద్వాసన పలుకుతానని చెప్పారు. ‘రోహిత్ చివరి 14 ఇన్నింగ్సుల్లో యావరేజ్ 11 మాత్రమే. ఇది ఆయన వైఫల్యానికి నిదర్శనం. ఎవరైనా ఏదో ఒకదశలో కెరీర్ చరమాంకానికి చేరుకోక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News December 21, 2025

బాలీవుడ్ నటి నోరా ఫతేహీ కారుకు ప్రమాదం

image

బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ పెద్ద రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబైలో ఓ మ్యూజిక్ ఈవెంట్‌కు వెళ్తున్న ఆమె కారును అంబోలీలోని లింక్ రోడ్‌లో మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో వేగంగా ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నోరాకు స్వల్ప గాయాలు కాగా వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.

News December 21, 2025

బ్రహ్మాస్త్రం తయారీ.. ఉపయోగించే విధానం

image

వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను మెత్తగానూరి ముద్దలా తయారు చేయాలి. ఒక పాత్రలో 10 లీటర్ల ఆవు మూత్రం, ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి బాగా ఉడికించి పొయ్యి మీద నుంచి దించి.. 48 గంటల పాటు చల్లారనివ్వాలి. తర్వాత గుడ్డతో వడకడితే బ్రహ్మాస్త్రం సిద్ధమైనట్లే. ఎకరాకు 100 లీటర్ల నుంచి 2 లేదా రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారీ చేయాలి. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.

News December 21, 2025

స్లీవ్‌లెస్, చిరిగిన దుస్తులతో ఆఫీసుకు రావొద్దు!

image

హుందాగా ఉండే డ్రెస్సులతోనే ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతమంది సిబ్బంది అసభ్యకరంగా దుస్తులు ధరించారని ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపింది. ‘ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేదు. కానీ కొందరు కాలేజీ యువత మాదిరి చిరిగిన జీన్స్, స్లీవ్‌లెస్, బిగుతైన దుస్తులు ధరిస్తున్నారు. ఇది సరికాదు. విధి నిర్వహణలో హుందాగా ఉండాలి’ అని DPAR విభాగం ఉత్తర్వులిచ్చింది.