News August 20, 2024

ప్రజలతో అన్న క్యాంటీన్లను నిర్వహిస్తే బాగుంటుంది: రఘురామ

image

AP: ప్రజలతో అన్న క్యాంటీన్ల నిర్వహణ జరిగితే చాలా బాగుంటుందని ఉండి MLA రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ప్రజల సహకారంతో ప్రభుత్వంపై భారం లేకుండా క్యాంటీన్ల నిర్వహణ కొనసాగాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు చెప్పిన దాని కంటే ఎక్కువగానే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారన్నారు. గత YCP ప్రభుత్వం AP ఆర్థిక వ్యవస్థను చింపిన విస్తరిలా చేసిందని దుయ్యబట్టారు.

Similar News

News November 28, 2025

శరవేగంగా అమరావతి పనులు: మంత్రి లోకేశ్

image

AP: రైతుల త్యాగ ఫలితమే అమరావతి అని మంత్రి లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వం దీన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో 1,631 రోజులపాటు రైతులు ఉద్యమం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు.

News November 28, 2025

WPL వేలంలో అదరగొట్టిన తెలుగమ్మాయిలు

image

WPL 2026 వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్స్ సత్తా చాటారు. గొంగడి త్రిషను రూ.10 లక్షలకు యూపీ వారియర్స్‌, మమతను రూ.10 లక్షలకు ఢిల్లీక్యాపిటల్స్‌, క్రాంతిరెడ్డిని రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకున్నాయి. అరుంధతి రెడ్డిని రూ.75 లక్షలకు RCB జట్టు ఎంచుకుంది. ఇటీవలి వన్డే వరల్డ్‌ కప్‌ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన నల్లపు రెడ్డి శ్రీచరణిని రూ.1.30 కోట్లతో ఢిల్లీ తిరిగి సొంతం చేసుకుంది.

News November 28, 2025

స్విగ్గీ, జొమాటో, జెప్టో గోడౌన్లలో ఇదీ పరిస్థితి

image

TG: హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థల గోడౌన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. స్విగ్గీ, జెప్టో, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు చెందిన 75 గోడౌన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో ఎక్స్‌పైర్డ్, మిస్ బ్రాండెడ్ వస్తువులను సీజ్ చేశారు. కుళ్లిన ఫ్రూట్స్, కూరగాయలను గుర్తించారు. పలు వస్తువుల శాంపిల్స్ సేకరించారు. ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశారు.