News March 31, 2024
బీజేపీ 200 స్థానాల్లో గెలిస్తే గొప్ప: మమత

బీజేపీకి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. 400 లోక్‌సభ స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాషాయపార్టీ.. 200 స్థానాలు గెలిచి చూపించాలని అన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 200 స్థానాలు గెలుస్తామని చెప్పి.. 71 దగ్గరే ఆగిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సీఏఏ, NRCని అనుమతించబోమని తేల్చి చెప్పారు. పౌరసత్వం ఉన్న వారిని విదేశీయులుగా మార్చేందుకు సీఏఏ ఒక మార్గమని ఆరోపించారు.
Similar News
News January 25, 2026
కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.
News January 25, 2026
షోరూమ్‌లలో వెహికల్ రిజిస్ట్రేషన్ వాటికి మాత్రమే!

TG: వాహనదారులు ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లకుండా షోరూమ్‌ల వద్దే వెహికల్స్ <<18940796>>రిజిస్ట్రేషన్<<>> జరిగేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిస్టమ్ నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ప్రైవేట్ టూ వీలర్లు, కార్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, గూడ్స్ వాహనాలకు వర్తించదు. ఆ వాహనాలకు పాత పద్ధతిలో ఆర్టీఏ ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు.
News January 25, 2026
ఆలు కుదురూ చేను కుదురూ ఆనందం

“ఆలు”అంటే భార్య. “కుదురు” అంటే స్థిరత్వం లేదా సవ్యంగా ఉండటం. భార్యతో కలహాలు లేకుండా కుటుంబ జీవితం సజావుగా, సంతోషంగా, స్థిరంగా ఉన్నప్పుడూ.. చేను కుదురూ అంటే పొలం(ఆదాయ వనరులు) బాగుండి, ఆదాయం స్థిరంగా ఉన్నప్పుడే రైతు జీవితంలో నిజమైన ఆనందం, ప్రశాంతత లభిస్తాయని ఈ సామెత చెబుతుంది.


