News October 19, 2025
నేడు ఇలా చేస్తే చాలా మంచిది

నరక చతుర్దశి రోజున పొద్దున్నే లేచి, నువ్వుల నూనెతో తలంటుకుని, నెత్తిపై ఉత్తరేణి కొమ్మ ఉంచుకొని స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘నల్ల నువ్వులతో ‘యమాయ తర్పయామి’ అంటూ యమ తర్పణాలు వదలాలి. ఇది నరకాసురుడు మరణించిన సమయం. ఈ తర్పణం, యమధర్మరాజు శ్లోక పఠనం ద్వారా పాపాలు హరించి, నరకం నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో ముగ్గులు వేసి, మినప వంటకాలు తినడం శుభప్రదం’ అని సూచిస్తున్నారు.
Similar News
News October 19, 2025
బ్రౌన్ షుగర్‌తో ఫేస్ మాస్క్

బ్రౌన్ షుగర్ అందాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించి మెరిసేలా చేస్తుంది. కాస్త బ్రౌన్ షుగర్‌లో పాలు, పెసరపిండి కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో చర్మంపై ముడతలు, మొటిమలు తగ్గుతాయి. అలాగే బ్రౌన్ షుగర్‌లో బాదం నూనె, జాస్మిన్ ఆయిల్ కలిపి చర్మానికి రాసి, కాసేపటి తర్వాత కడిగేస్తే ముఖం తేమగా ఉంటుంది.
News October 19, 2025
నితీశ్.. ఇక ఆల్ ఫార్మాట్ ప్లేయర్

తెలుగు ప్లేయర్ నితీశ్‌కుమార్ రెడ్డి ఇవాళ వన్డేల్లో అరంగేట్రం చేశారు. AUSతో తొలి వన్డేలో జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన NKR ఇప్పుడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా అవతరించారు. గతేడాది NOV 22న విరాట్ కోహ్లీ నుంచి టెస్ట్ క్యాప్ అందుకోగా తాజాగా రోహిత్ శర్మ చేతులమీదుగా వన్డే క్యాప్ తీసుకున్నారు. ఇవి నితీశ్ కెరీర్‌లో మరిచిపోలేని మూమెంట్స్‌గా మిగిలిపోనున్నాయి.
News October 19, 2025
ఐఐటీ బాంబే 53 పోస్టులకు నోటిఫికేషన్

ఐఐటీ బాంబే 53 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 7వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/career/apply