News March 21, 2025
చంద్రబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేది: అంబటి

AP: ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాల్లో పస లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే YCP MLAలు సభకు వెళ్లలేదని చెప్పారు. కూటమి నేతలను పొగుడుకునేందుకే సభా సమయం సరిపోయిందన్నారు. స్కిట్స్‌లోనూ జగన్ పేరు మర్చిపోలేకపోయారని, CBN శకుని పాత్ర వేస్తే బాగుండేదని సెటైర్లు విసిరారు. YSR స్నేహితుడినని చెప్పుకునే ఆయన ఇప్పుడు వైఎస్సార్ జిల్లా పేరు మార్చారని మండిపడ్డారు.
Similar News
News December 12, 2025
కలెక్షన్ల సునామీ.. వారంలో రూ.300 కోట్లు

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.300 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. భారత్‌లో రూ.218 కోట్లు వసూళ్లు చేయగా వరల్డ్ వైడ్‌గా రూ.313 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు వెల్లడించింది. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఆదిత్య ధార్ ఈ మూవీని తెరకెక్కించారు. దీంతో గల్ఫ్ కంట్రీస్ ధురంధర్‌ను బ్యాన్ చేశాయి.
News December 12, 2025
డిఫెన్స్ లాబోరేటరీ, జోధ్‌పుర్‌లో ఇంటర్న్‌షిప్

DRDOకు చెందిన డిఫెన్స్ లాబోరేటరీ, జోధ్‌పుర్ 20 ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. బీఈ/బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు స్టైపెండ్ రూ.5వేలు చెల్లిస్తారు. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తును స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్సైట్: https://www.drdo.gov.in/
News December 12, 2025
ఉపాధి హామీ పథకం పేరు మార్చిన కేంద్రం

ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ‘పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం’గా పేరు మార్చింది. అదే విధంగా ఏడాదికి 120 రోజుల పని దినాలను తప్పనిసరి చేసింది. ఈ స్కీంకు రూ.లక్షా 51 వేల కోట్లు కేటాయించింది.


