News July 22, 2024
అప్పుడూ డీజీపీని హెలికాప్టర్లో పంపి ఉంటే బాగుండేది: YCP

AP: మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాద ఘటనతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని YCP మండిపడింది. ‘హత్యలు, అత్యాచార ఘటనల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమే ఇది. కలెక్టర్, CCL ఆఫీసుల్లో, ఆన్లైన్లోనూ ఆ రికార్డులుంటాయి. YCP నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారం, రషీద్ హత్య జరిగినప్పుడు DGPని ఇలాగే హెలికాప్టర్లో పంపి ఉంటే బాగుండేది’ అని ట్వీట్ చేసింది.
Similar News
News December 19, 2025
రాజ్యసభలోనూ VB-G RAM G బిల్లుకు ఆమోదం!

ప్రతిపక్షాల నిరసనల నడుమ రాజ్యసభలో VB-G RAM G బిల్లు ఆమోదం పొందింది. కాగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలనే డిమాండ్తో ప్రతిపక్ష MPలు వాకౌట్ చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమంలో ఈ బిల్లు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మహాత్మా గాంధీ ఆదర్శాలను కాంగ్రెస్ అగౌరపరుస్తోందని మండిపడ్డారు. మరోవైపు ఈ చట్టాన్ని BJP వెనక్కి తీసుకొనే రోజు వస్తుందని మల్లికార్జున ఖర్గే చెప్పారు.
News December 19, 2025
జీవితఖైదు వేసే అధికారం సెషన్స్ కోర్టుకు లేదు: సుప్రీం కోర్టు

జీవితఖైదు శిక్ష విధించే అధికారం కేవలం రాజ్యాంగబద్ధ కోర్టులకు మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించడం, కోర్టులు వేసిన శిక్ష తగ్గించే అధికారాలు సెషన్ కోర్టులకు లేవని జస్టిస్ అహ్సానుద్దిన్ అమానుల్లా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల బెంచ్ చెప్పింది. లైంగిక కోరిక తీర్చడానికి నిరాకరించడంతో మహిళకు నిప్పంటించి చంపేసిన కేసు విచారణలో సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది.
News December 19, 2025
విశాఖ రుషికొండ బిల్డింగ్పై జగన్ ఏమన్నారంటే?

AP: మెడికల్ కాలేజీల అంశంపై గవర్నర్ను కలిసిన అనంతరం YCP చీఫ్ జగన్ విశాఖ రుషికొండ నిర్మాణాలపై స్పందించారు. ‘మా హయాంలో రుషికొండపై రూ.230CRతో బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మిస్తే, అది ఇప్పుడు నగరానికే తలమానికమైంది. అయినా దానిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. విశాఖలో ఒకరోజు యోగా డే కోసం అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు. మ్యాట్లు మొదలు మిగిలిన సామగ్రి కొనుగోలులోనూ అవినీతికి పాల్పడ్డారు’ అని ఆరోపించారు.


