News June 11, 2024
ఏపీకి అర్బన్ డెవలప్మెంట్ ఇస్తే బాగుండేదని అభిప్రాయం!

NDAలో కీలకమైన టీడీపీకి ప్రాధాన్యమైన శాఖలు దక్కలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా కల్గిన విమానయాన శాఖ కేటాయించినా ఏపీకి అంతగా ప్రయోజనం ఉండదంటున్నారు. అర్బన్ డెవలప్మెంట్ ఇస్తే అమరావతి అభివృద్ధి వేగవంతం అయ్యే అవకాశం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. అయితే మంత్రి పదవుల కన్నా కేంద్రనిధులపైనే టీడీపీ ఫోకస్ పెట్టినట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.
Similar News
News November 22, 2025
రేపు భారత్ బంద్కు పిలుపు

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్కు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. బంద్కు అంతా సహకరించాలని కోరారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, నేతలు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు విడిచి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. పలు ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
News November 22, 2025
పైరసీతో చిన్న నిర్మాతలకు తీవ్ర నష్టం: బన్నీ వాస్

పైరసీ వల్ల ఎంతో మంది చిన్న సినిమాల నిర్మాతలు నష్టపోతున్నారని బన్నీ వాస్ అన్నారు. పైరసీ తప్పని, అలాంటి తప్పును కొందరు తమకు లాభం కలిగిందని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఏడాదిలో 10-15 సినిమాలకే టికెట్ రేట్స్ పెంచుతున్నారని పేర్కొన్నారు. కానీ ఆ సినిమాలకే కాకుండా మిగతా చిత్రాలూ పైరసీకి గురవుతున్నాయని తెలిపారు. పైకి బాగానే కనిపిస్తున్నా ఆ నిర్మాతలు లోపల బాధ పడుతున్నారన్నారు.
News November 22, 2025
గ్లోబల్ సమ్మిట్: తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ముసాయిదా ISB ఖరారు

TG: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( ISB) “తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్” ముసాయిదాను రూపొందించింది. ఐటీ, పరిశ్రమ, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, చిత్రపరిశ్రమల అభివృద్ధిపై ఇది రూపొందింది. 3 ట్రిలియన్ USD ఆర్థిక వ్యవస్థను సాధించడంతో పాటు మహిళ, రైతు, యువత సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అన్ని శాఖలతో చర్చించి ISB రూపొందించిన ఈ డాక్యుమెంట్ను DEC తొలివారంలో క్యాబినెట్ భేటీలో ఆమోదించనున్నారు.


