News January 9, 2025
బీజేపీ, ఆప్ మధ్యే పోటీ: కేజ్రీవాల్
త్వరలో జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో ఆమ్ ఆద్మీ పార్టీ నేరుగా తలపడుతుందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ఆప్ పోటీ చేయట్లేదని పేర్కొన్నారు. అయితే తమ పార్టీకి మద్దతు ఇస్తున్న ఇండియా కూటమి నాయకులకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 10, 2025
IMD@150 ఏళ్లు.. సెమినార్‌కు పాక్, బంగ్లాకు ఆహ్వానం
1875 జనవరి 15న ప్రారంభమైన భారత వాతావరణ శాఖ(IMD)కు 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్రం ‘అన్‌డివైడెడ్ ఇండియా’ సెమినార్ నిర్వహించనుంది. ఆ రోజున ప్రత్యేకంగా రూ.150 స్మారక నాణేన్ని విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి పాక్, బంగ్లాదేశ్‌తోపాటు పొరుగున ఉన్న దేశాలు, మిడిల్ ఈస్ట్, సెంట్రల్, సౌత్ వెస్ట్ దేశాలకు ఆహ్వానం పలికింది. తాము హాజరవుతామని పాక్ తెలపగా, బంగ్లా ఇంకా స్పందించలేదు.
News January 10, 2025
జనవరి 10: చరిత్రలో ఈరోజు
* 1894: కవి పింగళి లక్ష్మీకాంతం జననం. 1972లో జనవరి 10నే ఆయన కన్నుమూశారు.
* 1920: నానాజాతి సమితిలో సభ్యత్వం పొందిన భారత్
* 1940: ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు కేజే ఏసుదాసు పుట్టినరోజు(ఫొటోలో)
* 1973: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి రాష్ట్రపతి పాలన విధించారు.
News January 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.