News August 6, 2024
ఇది కోతలు కోసే ప్రభుత్వం: BJP

TG: రేవంత్ సర్కార్‌పై సోషల్ మీడియా వేదికగా తెలంగాణ బీజేపీ విమర్శలు గుప్పించింది. ‘కోతలు కోసే రేవంత్.. చేతులెత్తేసే ప్రభుత్వం..’ అంటూ క్యాప్షన్‌తో ఓ ట్వీట్ చేసింది. ‘రాష్ట్రంలో కరెంట్ కోతలు, రుణమాఫీలో కోతలు, రైతు భరోసాలో కోతలు, నోటిఫికేషన్లలో కోతలు, సాగు-తాగు నీళ్లలో కోతలు, మెడికల్ సీట్ల వాటాలో కోతలు’ అంటూ ఒక ఫొటోను పంచుకుంది. BJP విమర్శలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News November 26, 2025
పంటలలో తెగుళ్ల ముప్పు తగ్గాలంటే..

వేసవిలో భూమి/నేలను లోతుగా దున్ని తెగుళ్లను కలిగించే శిలీంద్రాలను నాశనం చేయవచ్చు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి. తెగుళ్లను తట్టుకొనే రకాల విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనశుద్ధి తప్పక చేసుకుంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నివారించుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను బట్టి విత్తుకునే/నాటుకునే సమయాన్ని మార్చుకోవడం వల్ల తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుంది.
News November 26, 2025
నితీశ్ కుమార్ రెడ్డి.. అట్టర్ ఫ్లాప్ షో!

తక్కువ కాలంలోనే మూడు ఫార్మాట్లలో చోటు దక్కించుకున్న తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవల ఘోరంగా విఫలం అవుతున్నారు. గతేడాది ఆస్ట్రేలియాపై మెల్బోర్న్లో సెంచరీ తర్వాత అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆ సెంచరీ తర్వాత అతడి 10 ఇన్నింగ్సుల స్కోర్ 1, 0, 4, 1, 1, 30, 13, 43, 10, 0గా ఉంది. అంటే 10 ఇన్నింగ్సుల్లో 10 సగటుతో 103 రన్స్ చేశారు. అటు బౌలింగ్‌లోనూ వికెట్లు తీయలేకపోతున్నారు.
News November 26, 2025
వైరల్ అయ్యాక అసభ్యకర మెసేజ్‌లు వచ్చాయి: నటి

ఆకర్షణీయమైన లుక్స్‌తో సోషల్ మీడియాలో వైరలయిన తర్వాత తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు వచ్చాయని నటి గిరిజా ఓక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఆ ఇంటర్వ్యూ తర్వాత నాకు ఆఫర్లేమీ రాలేదు. కానీ చాలా మంది మెసేజ్‌లు పంపారు. ఒక అవకాశం ఇస్తే మీ కోసం ఏదైనా చేస్తానని.. వాళ్లతో గంట గడిపేందుకు రేటు ఎంతో చెప్పాలని కొందరు అభ్యంతరకర మెసేజ్‌లు పంపారు’ అని ఆమె చెప్పుకొచ్చారు.


