News July 16, 2024
ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు: ప్రశాంత్ రెడ్డి

TG: విద్యుత్ కమిషన్పై CJI <<13639787>>వ్యాఖ్యలను<<>> స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ‘విచారణ పూర్తికాకముందే జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్మీట్లు పెట్టడం తప్పు. CJI వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. రేవంత్ ఇచ్చిన స్క్రిప్టునే కమిషన్ చెప్పింది. విద్యుత్ కొనుగోళ్లు సక్రమంగానే జరిగాయి. ఎలాగైనా కేసీఆర్ను ఇరికించాలని చూశారు’ అని ఆయన ఆరోపించారు.
Similar News
News January 30, 2026
OTTలోకి ‘నారీ నారీ నడుమ మురారి’

సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలతో పోటీ పడి హిట్ టాక్ తెచ్చుకున్న శర్వానంద్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ OTTలోకి వచ్చేస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది.
News January 30, 2026
ఉద్యోగులు SM అకౌంట్ తెరవాలంటే అనుమతి తప్పనిసరి!

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వాడకంపై బిహార్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఉద్యోగులెవరైనా SM ఖాతాను తెరవడానికి అధికారుల అనుమతి తప్పనిసరి. వీటికి అధికారిక ఈమెయిల్, ప్రభుత్వ నంబర్లను వాడరాదు. వారి హోదా, ప్రభుత్వ లోగోను SM పోస్టులలో ఉపయోగించరాదు. నకిలీ ఖాతాలను వాడితే చర్యలు తప్పవు. డిజిటల్ స్పేస్లో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
News January 30, 2026
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


