News October 16, 2025

ముగ్గుర్నీ చూస్తుంటే కనులపండువే: పయ్యావుల

image

AP: కూటమికి వేసిన ఒక్క ఓటు వంద లాభాలను తెచ్చిందని కర్నూలు GST సభలో మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ‘నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్‌ను చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇవాళ కనులపండువగా ఉంది. టారిఫ్‌ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మనవైపు తిప్పేలా చేసిన నాయకత్వం మోదీది. భవిష్యత్తు తరాల తలరాతలు మార్చే నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News October 16, 2025

‘ఓటుకు నోటు’ కేసు విచారణ వాయిదా

image

‘ఓటుకు నోటు‘ కేసు నిందితులు రేవంత్, సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 3కి వాయిదా వేసింది. రేవంత్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసు చట్టవిరుద్ధమని నిన్న ఆయన తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఏసీబీ చట్టం ప్రకారం లంచం తీసుకోవడమే నేరమని వాదించారు. గురువారం కూడా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. న్యాయమూర్తులు మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్ కేసు విచారించారు.

News October 16, 2025

50 ఏళ్ల వయసులో సింగర్ రెండో పెళ్లి!

image

సింగర్ రఘు దీక్షిత్ 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. సింగర్, ఫ్లూటిస్ట్ వారిజశ్రీ వేణుగోపాల్(34)ను ఈ నెలాఖరున ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. 2005లో డాన్సర్ మయూరి ఉపాధ్యాయతో ఆయనకు వివాహం జరగగా 2019లో విడాకులు తీసుకున్నారు. రఘు తెలుగులో శ్రీమంతుడు, S/O సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి సినిమాల్లో పాటలు పాడారు. కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో పలు చిత్రాలకు సంగీతం అందించారు.

News October 16, 2025

వంట చేయకపోతేనే హ్యాపీగా ఉంటారట!.. హార్వర్డ్ స్టడీ

image

తమ భర్తల కోసం వంట చేసేవారితో పోల్చితే చేయని స్త్రీల వైవాహిక జీవితమే సంతోషంగా ఉన్నట్లు హార్వర్డ్ అధ్యయనం తెలిపింది. ‘మహిళ నిత్యం వంట చేయడం వల్ల ఆమె తెలియకుండానే సేవకురాలిగా మారిపోతుంది. దీనివల్ల భాగస్వామ్య భావన తగ్గి, వైవాహిక సంతృప్తి కూడా తగ్గుతుంది’అని అధ్యయనం పేర్కొంది. 15 ఏళ్లపాటు 12వేల విదేశీ జంటలపై సర్వే చేయగా వంట చేసేవారు వైవాహిక జీవితంపై 6.1/10 ఇస్తే చేయనివారు 8.4/10 మార్కులిచ్చారు.