News April 22, 2025

అది చిన్ని బినామీ కంపెనీ: కేశినేని నాని

image

AP: విశాఖలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 60 ఎకరాలు కేటాయించడాన్ని విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినాని నాని తప్పుబట్టారు. అది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బినామీ కంపెనీ అని ఆరోపించారు. రూ.5,728 కోట్ల ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే అనుభవం, క్రెడిబిలిటీ ఆ సంస్థకు లేదన్నారు. వెంటనే భూ కేటాయింపులు రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబును కోరారు.

Similar News

News April 22, 2025

గంట వ్యవధిలోనే మళ్లీ పెరిగిన బంగారం ధర!

image

లైవ్ మార్కెట్‌లో బంగారం ధరలు నిమిష-నిమిషానికి మారుతూ ఆల్ టైమ్ రికార్డును చేరుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్షకు చేరగా గంట తేడాలోనే మరోసారి భారీగా పెరిగింది. ఇవాళ ఏకంగా రూ.3వేలు పెరిగి రూ.1,01,350కు చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,750 పెరిగి రూ.92,900కు చేరింది.

News April 22, 2025

RESULTS: ఆ గ్రూప్ విద్యార్థులకు షాక్

image

TG: ఇంటర్ ఫలితాల్లో HEC, CEC గ్రూప్ విద్యార్థులు నిరాశపరిచారు. ఫస్టియర్ HECలో 8959 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 3092 మందే (34.51%) పాసయ్యారు. CECలో 92745 మంది హాజరైతే 42259 మంది (45.56%) ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండియర్ HECలో 9031 మంది రాస్తే 4178 మంది (46.26%), CECలో 103713 మంది హాజరైతే 48658 మంది (46.92%) పాస్ అయ్యారు.

News April 22, 2025

రాహుల్ లెటర్‌పై స్పందించిన రేవంత్

image

TG: రాష్ట్రంలో వేముల రోహిత్ యాక్ట్ తీసుకురావాలన్న కాంగ్రెస్ అగ్రనేత<<16168187>> రాహుల్ గాంధీ<<>> విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హిరోషిమాలో రాహుల్ లేఖను చదివినట్లు పేర్కొన్నారు. చట్టం తీసుకురావాలని కోరడం స్ఫూర్తిదాయకమైన పిలుపు అన్నారు. ఆయన ఆలోచనలు, భావాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

error: Content is protected !!