News September 23, 2024

మీ వల్లే ఇది సాధ్యమైంది: మెగాస్టార్

image

గిన్నిస్ వరల్డ్ రికార్డు పొందడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌‌ను నేనెప్పుడూ ఊహించలేదు. నాకు అవకాశాలు ఇచ్చిన నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్‌లు, నా డాన్స్ మెచ్చిన సినీ ప్రేక్షకుల వల్లనే ఇది సాధ్యమైంది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. నా డాన్స్ ఇష్టపడిన ప్రతి ఒక్కరికీ ఇది అంకితం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 23, 2024

కాంగ్రెస్ నేతలు నన్ను అభినందిస్తూ మెసేజులు చేస్తున్నారు: KTR

image

TG: అమృత్ టెండర్లలో CM రేవంత్ రెడ్డి మోసాన్ని బయటపెట్టినందుకు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు తనను అభినందిస్తూ మెసేజులు చేస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ ఈ స్కామ్‌పై తెలంగాణ బీజేపీ నేతలు మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇది బీజేపీ, రేవంత్ మధ్య ఉన్న వింత ప్రేమను బయటపెడుతోందని పేర్కొన్నారు.

News September 23, 2024

హరీశ్ శంకర్‌కు బంపరాఫర్?

image

‘మిస్టర్ బచ్చన్‌’తో అభిమానులను నిరుత్సాహానికి గురి చేసిన దర్శకుడు హరీశ్ శంకర్ బంపరాఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇటీవల హరీశ్, చిరు కాంబినేషన్లో వచ్చిన యాడ్‌పై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తాయి.

News September 23, 2024

కేజీ ఉల్లి రూ.35.. సప్లైకి సిద్ధంగా 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్

image

ఉల్లి ధరలకు కళ్లెమేసేందుకు బఫర్ స్టాక్‌ను కేంద్రం హోల్‌సేల్ మార్కెట్లకు సప్లై చేయనుంది. ఇప్పటికే కొన్ని సిటీల్లో NCCF, NAFED ద్వారా కిలో రూ.35కే అమ్ముతున్నట్టు ప్రకటించింది. ‘ఎగుమతి సుంకం ఎత్తేయడంతో ఉల్లి ధరలు పెరుగుతాయని ముందే అంచనా వేశాం. అందుకే మావద్ద ఉన్న 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను సబ్సిడీతో విక్రయిస్తాం’ అని కన్జూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి అన్నారు. ప్రస్తుతం కేజీ ఉల్లి రూ.60గా ఉంది.