News May 13, 2024
ఇదో అపురూపమైన అనుభూతి: షర్మిల

AP: రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికల పండగ వేళ, తన తండ్రి వైఎస్ఆర్ ప్రాతినిధ్యం వహించిన కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అపురూపమైన అనుభూతి అని ఏపీసీసీ చీఫ్ షర్మిల ట్వీట్ చేశారు. తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. ఆయనను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ తల్లిదండ్రుల ఆశీస్సులు, దేవుడి దీవెన, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 26, 2026
శ్రీరామ నవమి రోజున ఏం చేయాలంటే?

రేపే శ్రీరామ నవమి. వేకువజామునే నిద్రలేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాలి. మంగళ స్నానాలు ఆచరించి, ఇంటిని మామిడి తోరణాలు, ముంగిట రంగవల్లికలతో అలంకరించుకోవాలి. సీతారాముల పటాలకు పూజ చేసి.. బెల్లం పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే సమీపంలోని రామాలయానికి వెళ్లి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనాలి. రామనామ స్మరణతో ఈ రోజంతా గడపడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
News March 26, 2026
అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది.
➤ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం
➤ మైనింగ్ లీజులను వడ్డెర సొసైటీలకు కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం
➤ ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50% రాయితీ
➤ 96 jr., sr. సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం
➤ 2025-26 ఏడాదిలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ
News March 26, 2026
నియోజకవర్గాలు 50శాతం పెరుగుతాయి: చంద్రబాబు

నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 50శాతం నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. దీని ద్వారా ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు వస్తాయని చెప్పారు. నియోజకవర్గాల పెంపు వల్ల పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, దీనిపై ప్రజలకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు.


