News January 14, 2025
విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్టే!

TG: వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలను పెంచొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఛార్జీల పెంపునకు డిస్కంలు అనుమతి కోరగా తిరస్కరించింది. ప్రస్తుత ఛార్జీలనే కొనసాగించాలని ఆదేశించింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ERCకి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ మేరకు ఈనెల 18న డిస్కంలు తమ ప్రతిపాదనలను ERCకి సమర్పించే ఛాన్సుంది. డిస్కంల నష్టాల మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తేనే ఛార్జీల పెంపు ఉండదని సమాచారం.
Similar News
News November 21, 2025
సిట్కు అన్నీ వాస్తవాలే చెప్పా: వైవీ సుబ్బారెడ్డి

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సిట్ విచారణ ముగిసింది. తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. సిట్కు అన్నీ వాస్తవాలే చెప్పానని తెలిపారు. దర్యాప్తుకు అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాలనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. 2018 తర్వాతి నుంచి చిన్న అప్పన్న తన దగ్గర పీఏగా పని చేయడం లేదని పేర్కొన్నారు.

CRICKET UPDATES

* రేపటి నుంచి యాషెస్ సంగ్రామం.. ఉ.7.50 గంటలకు పెర్త్ వేదికగా ఆసీస్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం
* ట్రై సిరీస్లో శ్రీలంకకు షాక్ ఇచ్చిన జింబాబ్వే.. 163 పరుగుల టార్గెట్ను ఛేదించలేక 95 రన్స్కే కుప్పకూలిన లంక
* ఈ నెల 27న WPL వేలం.. తొలి సెట్లో వేలానికి రానున్న దీప్తి శర్మ, రేణుకా సింగ్
* వందో టెస్టులో సెంచరీ బాదిన బంగ్లా స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్.. ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా రికార్డ్