News January 4, 2025
బుమ్రాను రెచ్చగొట్టడం ప్రమాదం: మార్క్ వా

జస్ప్రీత్ బుమ్రాలాంటి బౌలర్‌ను రెచ్చగొట్టడం ఆస్ట్రేలియాకు ప్రమాదకరమని ఆ జట్టు మాజీ ఆటగాడు మార్క్ వా వ్యాఖ్యానించారు. ‘కొన్‌స్టాస్ ఈ ఘటన నుంచి నేర్చుకోవాలి. ఆఖరి ఓవర్లో బుమ్రాను రెచ్చగొట్టాల్సిన అవసరం అతడికి ఏమాత్రం లేదు. అతడి వల్ల భారత ఆటగాళ్లందరూ ఏకమయ్యారు. కొన్‌స్టాస్ నాలుకను అదుపులో పెట్టుకోకపోతే ప్రత్యర్థి జట్లకు లక్ష్యంగా మారతాడు’ అని హితవు పలికారు.
Similar News
News January 23, 2026
పీవీ సింధుపై సీఎంల ప్రశంసలు

ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 విజయాలు సాధించిన తొలి భారతీయురాలిగా ఘనత వహించిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆట పట్ల ఆమె అంకితభావం, పట్టుదలను రేవంత్ కొనియాడారు. సింధు ఘనత దేశానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
News January 23, 2026
రేపటి నుంచి రష్యా-ఉక్రెయిన్-అమెరికా కీలక చర్చలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా తొలి అడుగుగా UAEలో రేపటి నుంచి త్రైపాక్షిక సమావేశం జరగనుంది. జనవరి 23, 24 తేదీల్లో ఉక్రెయిన్, అమెరికా, రష్యా ప్రతినిధులు చర్చలు జరుపుతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దావోస్‌లో ప్రకటించారు. ఇది మొదటి త్రైపాక్షిక భేటీ కావడం విశేషం. US అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. రష్యా కూడా రాజీకి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
News January 22, 2026
ముగిసిన దావోస్ పర్యటన.. అమెరికాకు CM రేవంత్

TG: ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసినట్లు ప్రభుత్వం తెలిపింది. 3 రోజుల WEFలో ఆశించిన లక్ష్యాన్ని సాధించినట్లు పేర్కొంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని, AI, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ అంశాలపై MoUలు కుదిరాయని వెల్లడించింది. మరోవైపు దావోస్‌లో కార్యక్రమాలు ముగించుకొని CM రేవంత్ <<18905782>>అమెరికా పర్యటన<<>>కు వెళ్తున్నారు.


