News September 20, 2025
రేవంత్‌కు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది: రామ్‌చందర్

TG: CM రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని రాష్ట్ర BJP చీఫ్ రామ్‌చందర్ ఎద్దేవా చేశారు. ‘కిషన్‌రెడ్డిని నిందించడం రేవంత్ మానుకోవాలి. ఆయనకు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది. కాళేశ్వరంపై ప్రభుత్వం రాసిన లేఖ CBI దగ్గర ఉంది’ అని అన్నారు. ఆపరేషన్ కగార్‌పై మాట్లాడుతూ ‘మావోలతో చర్చల అంశం కేంద్రం చూసుకుంటుంది. వారితో అనేకసార్లు చర్చలు జరిగినా హింస పెరిగిందే కానీ తగ్గలేదు’ అని చెప్పారు.
Similar News
News September 20, 2025
BREAKING: మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. 2023 సంవత్సరానికి గానూ కేంద్రం ఆయన్ను ఎంపిక చేసింది. ఈ నెల 23న జరిగే 71వ జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. మోహన్‌లాల్ మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో నటించి మెప్పించారు.
News September 20, 2025
పిల్లల్లో అసూయ పెరుగుతోందా?

సాధారణంగా పిల్లలు కొన్నిసార్లు ఇతరులను చూసి అసూయ పడతారు. దాన్ని తల్లిదండ్రులు గుర్తించి మొదట్లోనే కట్టడి చేయాలి. లేదంటే భవిష్యత్తులో ప్రవర్తన విపరీతంగా మారొచ్చు. ముందు దానికిగల కారణాన్ని తెలుసుకోవాలి. సానుకూలంగా ఆలోచించడం, వారి ప్రత్యేకతలపై దృష్టి పెట్టడం నేర్పాలి. స్నేహం గొప్పతనం గురించి వారికి వివరించాలి. ఈ క్రమంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం. అప్పుడే పిల్లలు రాగద్వేషాలకు అతీతంగా ఎదుగుతారు.
News September 20, 2025
7,267 పోస్టులకు నోటిఫికేషన్.. అప్లికేషన్స్ స్టార్ట్

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, PG, B.Ed, డిప్లొమా పాసైనవారు OCT 23 వరకు అప్లై చేసుకోవచ్చు. PGT 1,460, TGT 3,962, ప్రిన్సిపల్ 225, వార్డెన్ 346, Jr క్లర్క్ 228, అకౌంటెంట్ 61, స్టాఫ్ నర్స్ 550, ఫీమేల్ వార్డెన్ 289, ల్యాబ్ అటెండెంట్ 146 పోస్టులున్నాయి. వివరాలకు https://nests.tribal.gov.inను సంప్రదించండి.