News July 23, 2024

FM ఎంట్రీ ఇచ్చిన రోజు ఇది!

image

రేడియోతో భారతీయుల బంధం ఎంతో ప్రత్యేకం. 1923లో బాంబే ప్రెసిడెన్సీ రేడియో క్లబ్‌లో ప్రారంభమైన ప్రసారాలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. కొన్నాళ్లకు ఈ రేడియో ప్రతీ ఇంటి ‘ఆకాశవాణి’ అయింది. అలా రేడియో హవా కొనసాగుతున్న వేళ 1977 జులై 23న చెన్నైలో FM లాంచ్ కావడంతో మరో ముందడుగు పడింది. ఈ రేడియో ప్రసారాల సుదీర్ఘ ప్రయాణానికి గుర్తుగా కేంద్రం ఏటా జులై 23ని నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్‌డే ప్రకటించింది.

Similar News

News January 8, 2026

ED రైడ్స్.. IPAC ఆఫీసుకు మమత పరుగులు

image

<<18796717>>ED రైడ్స్‌<<>>తో WBలో రాజకీయ వేడి రాజుకుంది. తనిఖీలు జరుగుతున్న కోల్‌కతా సాల్ట్‌లేక్‌లోని IPAC ఆఫీసుకు CM మమత చేరుకున్నారు. బిల్డింగ్ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు క్లోజ్ చేసి ఉండడంతో బేస్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో 11వ ఫ్లోర్‌లోని IPAC ఆఫీసులోకి వెళ్లారు. ఆమె, పోలీసులు కలిసి ED రైడ్స్‌ను అడ్డుకున్నారని BJP ఆరోపించింది. దీదీ చర్యలను BJP నాయకులు ఖండిస్తున్నారు. కీలక డాక్యుమెంట్లను తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయి.

News January 8, 2026

కోళ్ల దాణా నిల్వలో ఈ జాగ్రత్తలు పాటించండి

image

కోళ్ల దాణా బస్తాలను గోడలకు, నేలకు తగలకుండా చెక్క పలకల మీద పేర్చాలి. రెండు వరుసల మధ్య 2 అడుగులు ఖాళీ ఉంచాలి. బాగా ఎండి, పొడిగా ఉన్న ముడి సరుకులనే నిల్వ చేయాలి. చలికాలంలో దాణాలో తేమ 9 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. దాణాను 2-3 వారాలకు మించి నిల్వ చేయకూడదు. వేడిగా ఉన్న దాణా లేదా ముడి సరుకులను చల్లబడిన తర్వాతే గోదాముల్లో నిల్వ చేయాలి. లేకుంటే దాణా ఉంచిన బస్తాలపై తేమ పేరుకొని బూజు పడుతుంది.

News January 8, 2026

భారీ జీతంతో నీతిఆయోగ్‌లో ఉద్యోగాలు

image

<>నీతిఆయోగ్<<>> 31 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి PG/MBBS/BE/BTech ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గలవారు FEB 8 వరకు అప్లై చేసుకోవచ్చు. Sr. అడ్వైజర్‌కు నెలకు రూ.3,30,000, అడ్వైజర్‌కు రూ.2,65,000, Sr. స్పెషలిస్టుకు రూ.2,20,000, స్పెషలిస్టుకు రూ.1,45,000 , Sr. అసోసియేట్‌కు 1,25,000, అసోసియేట్‌కు రూ.1,05,000 చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: niti.gov.in