News August 4, 2024

ఇది కష్టానికి దక్కిన ఫలితం: KTR

image

TG: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ చిత్రంగా ‘బలగం’ నిలవడంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మూవీని అద్భుతంగా తెరకెక్కించిన వేణు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. ఇది వేణుతో పాటు అతడి టీమ్‌ కష్టానికి దక్కిన ఫలితమని కొనియాడారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

Similar News

News March 19, 2026

కేరళం సీఎం ఆస్తి ₹కోటి!

image

కేరళం సీఎం పినరయి విజయన్ ధర్మదమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశారు. తనకు ₹45లక్షల విలువైన బ్యాంక్ డిపాజిట్లు, కన్నూర్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ సహా పలు కంపెనీ షేర్లు ఉన్నాయని అఫిడవిట్‌లో వెల్లడించారు. ఓ రెసిడెన్షియల్ ప్లాట్, వ్యవసాయ భూమి కలిపి ₹56లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. అలాగే విజయన్‌పై ఆరు కేసులున్నట్లు అఫిడవిట్ పేర్కొంది. <<-se>>#Elections2026<<>>

News March 19, 2026

రంజాన్ ఎల్లుండే..

image

భారత్‌లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)ను మార్చి 21న జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. ఇవాళ ఆకాశంలో నెలవంక కనిపించలేదని పేర్కొన్నారు. రంజాన్ మాసం రేపటి (మార్చి 20)తో ముగియనుందని చెప్పారు. దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

News March 19, 2026

రేపే బడ్జెట్.. ఆరు కొత్త పథకాలు!

image

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో 6 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా యంగ్ ఇండియా కిట్స్, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ, పాడి రైతులకు రాయితీపై పశువుల సరఫరాను ప్రకటించే అవకాశం ఉంది. మహిళలు, రైతులు, యువత, పిల్లల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.