News March 21, 2025
మా జిల్లాలో రోడ్లు లేవని పిల్లనివ్వట్లే: స్పీకర్

TG: బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రమంతా రోడ్లు వేశామని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పడంపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. తమ వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు రోడ్ల పరిస్థితిపై రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీశ్ రావును మంత్రి కోమటి రెడ్డి ప్రశ్నించారు. మంత్రి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు.
Similar News
News November 23, 2025
డీసీసీ అధ్యక్ష పదవికి పర్వతగిరికి మొండి చేయి!

కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి పర్వతగిరికి మొండి చేయి దక్కింది. మండలం నుంచి కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా కన్వీనర్ బొంపల్లి దేవేందర్ రావు తీవ్రంగా పోటీ పడ్డారు. ఎవరి దారుల్లో వారు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ, తీరా ఇతరులకు దక్కడంతో ఉసూరుమన్నారు. పర్వతగిరి వాసులు సైతం మండలానికి డీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించారు.
News November 23, 2025
సామ్ కరన్ ఎంగేజ్మెంట్

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్‌ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్‌లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.
News November 23, 2025
పిల్లలు బరువు తగ్గుతున్నారా?

పిల్లలు పుట్టినప్పుడు సరైన బరువుతో ఉన్నా ఆ తర్వాత బరువు తగ్గిపోతున్నారని చాలామంది పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది సాధారణమే అంటున్నారు నిపుణులు. పుట్టినప్పుటి బరువులో 6-7 శాతం వరకు తగ్గుతారట. డబ్బా పాలు తాగేవారిలో 3-4 శాతం తగ్గుదల కనిపిస్తుంది. చిన్నారులు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే ఐదు నుంచి ఆరు నెలల తర్వాత రెట్టింపు బరువు పెరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు.


