News October 18, 2024

ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్: కేటీఆర్

image

TG: ప్రజెంటేషన్ పేరుతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి పరువు తీసుకున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. నిన్నటి సమావేశంలో రేవంత్ అన్ని అబద్ధాలు చెప్పారన్నారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అని సెటైర్లు వేశారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ గ్రాఫిక్స్ మాయజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.లక్షన్నర కోట్ల దోపిడిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

Similar News

News November 29, 2025

కామారెడ్డి: రాష్ట్ర స్థాయికి నామినేట్ అయిన 8 పాఠశాలలు

image

జిల్లా స్థాయిలో SHVR 2025-26 బెస్ట్ రేటింగ్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 8 పాఠశాలలు ఎంపికైనట్లు డీఈవో రాజు తెలిపారు. రూరల్‌లో TSNR ZPHS బీబీపేట్, ZPHS బోర్లం, ZPHS ధర్మారావుపేట్, PS మహమ్మదాపూర్, PS శక్తి నగర్, UPS ఇస్సన్నపల్లి, అర్బన్‌లో సరస్వతీ శిశుమందిర్ కామారెడ్డి, PS INC కామారెడ్డి స్కూల్స్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి నామినేట్ అయినట్లు DEO పేర్కొన్నారు.

News November 29, 2025

GDP వృద్ధి.. దేశ పౌరులందరికీ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త: CBN

image

2025-26 రెండో త్రైమాసికంలో దేశ GDP 8.2% వృద్ధి చెందడం ప్రతి పౌరుడికి ఉత్సాహాన్నిచ్చే వార్త అని CM CBN అన్నారు. ఈ వేగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని నిలిపిందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ లక్ష్యాల వైపు స్థిరంగా కొనసాగుతోందన్నారు. తాజా వృద్ధి తయారీ, నిర్మాణం, ఆర్థిక సేవలు తదితర రంగాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

News November 29, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.