News June 16, 2024

తప్పు కోహ్లీది కాదు పిచ్‌ది: హర్భజన్

image

టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ ఫామ్ లేమికి కారణం ఇప్పటి వరకు ఆడిన పేలవమైన పిచ్‌లేనని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘విరాట్ సహా ఆ పిచ్‌లపై ఆడిన ఏ బ్యాటర్‌నూ తప్పుపట్టలేం. వాటిపై ఆడటం కష్టంగా కనిపించింది. అలాంటి పరిస్థితుల్లో కోహ్లీ ఫామ్‌ను అంచనా వేయకూడదు. తన నుంచి పరుగుల్ని ఆశిస్తాం కరెక్టే కానీ పరిస్థితుల్నీ చూడాలి కదా. సూపర్-8లో కోహ్లీ ఫామ్ అందుకుంటారు’ అని పేర్కొన్నారు.

Similar News

News January 4, 2025

శ్రీవారి భక్తులకు TTD ఛైర్మన్ విజ్ఞప్తి

image

AP: వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని.. 10,11,12వ తేదీల్లోనే స్వామిని దర్శించుకోవాలని అనుకోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. టోకెన్లను తీసుకోవాలన్న ఆత్రుతలో తోసుకోవద్దని సూచించారు. VIPలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని, సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

News January 4, 2025

ఒక్క సినిమాకు రూ.75 కోట్లు తీసుకోనున్న చిరంజీవి!

image

మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమాను ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోన్న మూవీ నుంచి విడుదలైన ఓ చిన్న పోస్టర్ భారీ అంచనాలు పెంచేసింది. అయితే, ఈ చిత్రం కోసం చిరు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు PINKVILLA తెలిపింది. కెరీర్‌లోనే అత్యధికంగా రూ.75 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News January 4, 2025

తెలుగు భాషను కాపాడుకోవాలి: కిషన్ రెడ్డి

image

తెలుగు భాషను మాట్లాడటం, రాయడం ద్వారానే పరిరక్షించగలమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. HYDలో తెలుగు సమాఖ్య మహాసభల్లో ఆయన మాట్లాడారు. బోధన భాషగా తెలుగును ప్రాచుర్యంలోకి తీసుకురావాలని సూచించారు. పాలన, అధికార వ్యవహారాలు తెలుగులోనే జరిగేలా చూడాలని AP, TG ప్రభుత్వాలను కోరారు. వాడుక భాషలో 30% తెలుగు, 70% ఇంగ్లిష్ ఉంటోందని.. ఇలా అయితే మనకు తెలియకుండానే తెలుగు కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.