News October 2, 2024
‘ఆగడు’కి ముందు అనుకున్న కథ అది కాదు: శ్రీను వైట్ల

మహేశ్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో దూకుడు వంటి హిట్ తర్వాత వచ్చిన ‘ఆగడు’ ఫ్యాన్స్ను నిరాశపరిచింది. అయితే తాను వాస్తవంగా ఆ సినిమాకు అనుకున్న కథ వేరే అని శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆగడుకి ముందు మహేశ్కు వేరే స్టోరీ అనుకున్నాం. మహేశ్కూ నచ్చింది. కానీ బడ్జెట్ పరిమితుల దృష్ట్యా పల్లెటూరిలో జరిగే సింపుల్ కథను ఎంచుకుని సినిమాగా తీశాం. నేను ఇప్పటికీ బాధపడే నిర్ణయం అది’ అని తెలిపారు.
Similar News
News November 25, 2025
26న BRS సన్నాహక సమావేశం: జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈనెల 29న నిర్వహించనున్న ‘దీక్షా దివస్’ను విజయవంతం చేయడానికి నిజామాబాద్లో ఈ నెల 26న సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 ఒక మైలురాయి లాంటిదని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందని ఆయన గుర్తు చేశారు.
News November 25, 2025
పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?

తెల్లగా కనిపించే పాలిష్ రైస్ తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత B1 అందక బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్2 డయాబెటిస్ రావచ్చు. ఫైబర్ తక్కువగా ఉండడంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక కీళ్ల నొప్పులు వస్తాయి.
News November 25, 2025
CCRHలో 90 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH )లో 90 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. రీసెర్చ్ ఆఫీసర్, Jr లైబ్రేరియన్, MLT, LDC, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, B.Lisc, ఇంటర్, టెన్త్, BSc(నర్సింగ్), MSc, MS, MD, DMLT, MLT ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: ccrhindia.ayush.gov.in


