News September 3, 2025
అమ్మకు దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం: కవిత

TG: ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తల్లికి దూరంగా ఉండటమే తనను ఎక్కువగా బాధిస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ‘తల్లితో మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా? నా తల్లికి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఇంతకుమించిన బాధ ఇంకోటి లేదు. రాజకీయ పదవులు వస్తాయి, పోతాయి. కానీ తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు’ అని ఎమోషనల్ అయ్యారు. పార్టీ నుంచి సస్పెండ్ అవటం తన జీవితంలో ముఖ్యమైన పరిణామం అని పేర్కొన్నారు.
Similar News
News September 5, 2025
BRSకు సుప్రీం కేసీఆరే: హరీశ్ రావు

TG: కవిత <<17599702>>ఆరోపణలపై<<>> మాజీ మంత్రి హరీశ్ రావు పరోక్షంగా స్పందించారు. BRSకు సుప్రీం కేసీఆరే అని, ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే KCR తమకు నేర్పించారని తెలిపారు. ‘కాళేశ్వరం’ అవినీతికి హరీశ్ రావు కారణమంటూ ఆరోపణలు చేయడంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆమె పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
News September 5, 2025
US: రక్షణ శాఖ ఇకపై యుద్ధ శాఖ

US రక్షణశాఖ (పెంటగాన్)ను ఇక నుంచి యుద్ధశాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్)గా పిలవాలని ట్రంప్ ఆదేశించారు. ‘డిఫెన్స్ సెక్రటరీ’ని ‘వార్ సెక్రటరీ’గా పేర్కొంటూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. నిజానికి ఆ దేశ రక్షణశాఖ 1789-1947 మధ్య డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌గా ఉండేది. ఆ తర్వాత రక్షణ శాఖగా మార్చారు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ పాత పేరు పెట్టారు. ప్రత్యర్థులకు తమ యుద్ధ సన్నద్ధతను తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
News September 5, 2025
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతోనే మొదలయ్యాయి. 10 గంటల సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 80,863 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు లాభం పొంది 24,788 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. M&M, రిలయన్స్, టాటా మోటర్స్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభాల్లో, ITC, HDFC, ICICI, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.