News April 6, 2025

ఏఐ వీడియోలు అనటం హాస్యాస్పదం: జగదీశ్ రెడ్డి

image

TG: కంచ గచ్చిబౌలిలో జరిగిన విధ్వంస దృశ్యాల్ని సీఎం రేవంత్ ఏఐ వీడియో అనటం హాస్యాస్పదంగా ఉందని BRS ఎమ్మెల్యే జగదీశ్ అన్నారు. నెమళ్ల అరుపులు, జింకపై కుక్కల దాడి, బుల్డోజర్లతో భూమిని చదును చేయటం కూడా ఏఐ సృష్టేనా అని ప్రశ్నించారు. పాకిస్థాన్, చైనా యుద్ధాలతో ఏఐకి సంబంధమేంటని, సీఎం వ్యాఖ్యలతో తెలంగాణ పరువు పోతోందన్నారు. రేవంత్ నిర్ణయాలతో రాష్ట్రం నష్టపోతోందని ఆరోపించారు.

Similar News

News November 17, 2025

ఐబొమ్మకు ఇక సెలవు

image

అనధికారిక (పైరసీ) మూవీ వెబ్‌సైట్ iBOMMAకు ‘సెలవు’ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నెలకు రూ.వేలల్లో చెల్లించి OTTలో మూవీలు చూడలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేసుకుంటున్నారు. అయితే దీనివల్ల థియేటర్లకు వెళ్లేవారు తగ్గారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల ‘పైరసీకి సెలవు’ అంటూ మరికొందరు స్వాగతిస్తున్నారు. ఐబొమ్మ క్లోజ్ అవ్వడం సినీ పరిశ్రమకు, OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉపశమనం కలిగించింది.

‘షూ బాంబర్’.. ఢిల్లీ పేలుడులో కీలక పరిణామం!

image

ఢిల్లీ పేలుడు కేసులో కీలక ముందడుగు పడింది. డా.ఉమర్ నబీ i20 కారును ‘షూ బాంబర్’తో పేల్చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. బ్లాస్ట్ అయిన కారు ముందు భాగంలో షూను కనుగొన్న అధికారులు అందులో మెటల్ లాంటి వస్తువును గుర్తించారు. దీంతో బాంబును యాక్టివేట్ చేయడానికి ఉమర్ షూ ట్రిగ్గర్‌ను ఉపయోగించినట్లు భావిస్తున్నారు. కాగా ఈ నెల 10న ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 10 మంది మరణించగా 32 మంది గాయపడ్డారు.