News July 17, 2024
ఘోరం.. బాలుడిని పీక్కుతిన్న కుక్కలు

TG: HYD శివారు జవహర్నగర్లో దారుణం జరిగింది. ఏడాదిన్నర బాలుడు విహాన్ నిన్న రాత్రి ఇంటిబయట ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. జుట్టును నోట కరుచుకొని ఈడ్చుకెళ్లాయి. కుక్కులు పీక్కుతినడంతో విహాన్ శరీరం ఛిద్రమైంది. జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి. బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. రాష్ట్రంలో కుక్కల దాడులు పెరిగినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.
Similar News
News September 18, 2025
ఈసీఐఎల్లో 160 ఉద్యోగాలు

హైదరాబాద్లోని <
News September 18, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

APలోని రాయలసీమలో ఒకటి, రెండుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలోని HYDలో సాయంత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.
News September 18, 2025
‘OG’ టికెట్ ధరల పెంపు.. YCP శ్రేణుల ఫైర్

పవన్ కళ్యాణ్ OG సినిమా <<17742687>>టికెట్<<>> రేట్లను పెంచడంపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనెఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీ కలుపుకుని) ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్ ధరలను సైతం (రూ.800+GST) పెంచిన విషయం గుర్తు లేదా అని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్?