News June 23, 2024

ఇది ప్రతీకారం తీర్చుకునే సమయం!

image

గత ఏడాది WTC ఫైనల్, ODI WC ఫైనల్‌లో టీమ్‌ఇండియాను ఆస్ట్రేలియా ఓడించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు భారత్‌కు వచ్చింది. రేపు జరగనున్న టీ20 WC మ్యాచులో భారత్ గెలిస్తే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్సుంది. ఇది జరగాలంటే ఎల్లుండి BANపై AFG గెలవాల్సి ఉంటుంది. AUS, AFG రెండూ ఓడితే వీటిలో మెరుగైన NRR ఉన్న జట్టు INDతో పాటు SFకి వెళ్తుంది.

Similar News

News January 10, 2025

విడాకుల ప్రచారంపై స్పందించిన చాహల్

image

భార్య ధనశ్రీతో విడిపోతున్నట్లుగా వస్తున్న వదంతులపై భారత క్రికెటర్ చాహల్ స్పందించారు. ఈమేరకు అభిమానులకు ఇన్‌స్టాలో ఓ లేఖ రాశారు. ‘నాకు ఇస్తున్న మద్దతుకు నా అభిమానులందరికీ కృతజ్ఞతలు. మీ మద్దతుతోనే ఇంతటివాడ్ని అయ్యాను. ఇంకా చాలా ప్రయాణం మిగిలే ఉంది. నా వ్యక్తిగత జీవితంపై ఆసక్తిని అర్థం చేసుకోగలను. కానీ దయచేసి ఆ విషయంలో సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయొద్దు’ అని కోరారు.

News January 9, 2025

అందుకే బీర్ల తయారీని నిలిపేస్తున్నాం: UBL

image

TG: రాష్ట్రంలో బీర్ల తయారీని నిలిపేయడానికి గల కారణాలపై యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ మరోసారి వివరణ ఇచ్చింది. ‘బీరు తయారీ ముడిసరకు ధరలు పెరిగాయి. బీరు ధరలో తయారీ రేటు 16 శాతం కాగా ప్రభుత్వ పన్నులు 70 శాతం ఉంటాయి. మాకు సర్కారు నుంచి సకాలంలో <<15107893>>చెల్లింపులు<<>> జరగట్లేదు. నష్టాలు భరించలేక బీర్ల సరఫరా ఆపేస్తున్నాం’ అని పేర్కొంది.

News January 9, 2025

వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల

image

AP: పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రేపటి నుంచి మొదలుకానున్న నేపథ్యంలో భూలోక వైకుంఠం తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్కాంతుల ధగధగల మధ్య శ్రీవారి క్షేత్రం మెరిసిపోతోంది. స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తజన గోవింద నామ స్మరణతో ఏడుకొండలు మారుమోగుతున్నాయి. రేపు వైష్ణవ క్షేత్రాల్లో శ్రీమన్నారాయణుడి వైకుంఠ ద్వార దర్శనం ముక్తిని ప్రసాదిస్తుందనేది భక్తుల విశ్వాసం.