News August 26, 2025

అభివృద్ధిని అడ్డుకుంటామంటే మీ ఇష్టం: RRR

image

AP: ప.గో. జిల్లా నూతన కలెక్టరేట్ నిర్మాణంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అన్నారు. ‘భీమవరంలో కట్టకుండా ఉండి తరలిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. కలెక్టరేట్ నిర్మాణానికి భీమవరంలో సరిపడా స్థలం అందుబాటులో లేదు. ఈ నిర్మాణంతో వ్యక్తిగతంగా నాకు ఏ లబ్ధి జరగదు. ఈ నిర్మాణానికి ప్రాసెస్ పూర్తయింది. దీన్ని ఆపి అభివృద్ధిని అడ్డుకుంటామంటే మీ ఇష్టం’ అని తెలిపారు.

Similar News

News August 26, 2025

50% సుంకాలు.. భారత్‌కు ఎంత నష్టమంటే?

image

అమెరికా విధించిన 50% <<17519222>>సుంకాలు<<>> ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం భారత్ నుంచి USకు $60.2 బిలియన్ల విలువైన సరుకులు ఎగుమతి అవుతుండగా అవి $18.6 బిలియన్లకు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని, GDP 0.2-0.5% తగ్గే అవకాశం ఉందన్నారు. టెక్స్‌టైల్, సముద్ర ఆహారం, లెదర్, ఫుట్‌వేర్, కెమికల్స్, ఆటోమొబైల్స్ రంగాలపై ఎక్కువ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

News August 26, 2025

ఈ నెల 29న క్యాబినెట్ భేటీ

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ నెల 29న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎస్ రామకృష్ణారావు పాల్గొంటారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

News August 26, 2025

మహీంద్రా వర్సిటీలో డ్రగ్స్ కలకలం

image

TG: మేడ్చల్ జిల్లా సూరారంలోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ వాడకం కలకలం రేపింది. 50 మంది స్టూడెంట్స్ డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. విద్యార్థులకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసింది. వారి నుంచి 1.15 కేజీల గంజాయి, 47gms ఓజీ వీడ్ స్వాధీనం చేసుకుంది. అరెస్టయిన నలుగురిలో ఇద్దరు విద్యార్థులున్నారు. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారం బయటపడింది.