News September 7, 2025
35 ఏళ్లుగా చాయ్ మాత్రమే తాగుతోంది!

ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాకు చెందిన పల్లి దేవి గత 35 ఏళ్లుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం టీ తాగుతూ జీవిస్తున్నారు. ఆమె తన 11 ఏళ్ల వయసు నుంచే ఆహారం, నీటికి బదులుగా టీ తాగుతూ శివుడి పూజలో నిమగ్నమైపోయారు. రోజుకు ఒకసారి బ్లాక్ టీ తాగుతున్నట్లు ఆమె కుటుంబీకులు చెబుతున్నారు. ఇన్నేళ్లుగా టీ మాత్రమే తాగి జీవించడం అసాధ్యమని, ఇప్పటికీ ఆమె ఆరోగ్యంగా ఉండటంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 7, 2025
ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ!

TG: ఈ నెల 15న కామారెడ్డిలో BC డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. BCలకు 42% శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఈ సభకు ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలకు ఆహ్వానం పంపనున్నట్లు సమాచారం. మరోవైపు రేపు HYDలో జరిగే PCC విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.
News September 7, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: వాయవ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News September 7, 2025
ఐదేళ్లలో 50 వేల మందికి విదేశాల్లో ఉద్యోగాలు: మంత్రి లోకేశ్

AP: సీడాప్ ద్వారా వచ్చే ఐదేళ్లలో 50 వేల మందికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ నెలలోనే నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభిస్తామన్నారు. అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం కింద జర్మనీ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను అభినందించారు. తొలి బ్యాచ్‌లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణనివ్వగా, ఇప్పటికే వివిధ విభాగాల్లో 40 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.