News October 19, 2024

అయ్యర్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా ముంబై

image

రంజీ ట్రోఫీలో మహారాష్ట్రతో జరుగుతున్న టెస్టులో ముంబై తొలి ఇన్నింగ్సులో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ అయుష్(176), శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగారు. దీంతో 200 పరుగులకు పైగా ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్సులో మహారాష్ట్ర 126 పరుగులకే ఆలౌటైంది. కాగా శ్రేయస్‌కు ఇది 14వ ఫస్ట్ క్లాస్ సెంచరీ.

Similar News

News February 3, 2026

నేడు ఏపీ కేబినెట్ భేటీ

image

AP: రాష్ట్ర కేబినెట్ భేటీ ఈరోజు జరగనుంది. ఉదయం 10:30 గంటలకు అమరావతి సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో మంత్రులు భేటీ కానున్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతోపాటు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. FEB 11వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. 14వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో పెడతారు.

News February 3, 2026

ఉప్పు వేయడం, వేర్లు నరకడం వల్ల కొబ్బరి దిగుబడి పెరుగుతుందా?

image

చాలా చోట్ల కొబ్బరి సాగు చేస్తున్న రైతులు చెట్లకు ఉప్పు వేయడం, వేర్లు నరకడం చేస్తుంటారు. దీని వల్ల దిగుబడి పెరుగుతుందని కొందరు చెబుతుంటారు. ఏడాది వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఏడాది దిగుబడి కొంత పెరగడం కనిపిస్తుంది. కానీ తర్వాత ఏడాది నుంచి దిగుబడి తగ్గిపోతుంది. అది చెట్టుకు కూడా హాని చేస్తుంది. ఇది అశాస్త్రీయమైన పద్ధతి అని, దీన్ని పాటించకపోవడం మంచిదని ఉద్యాన పరిశోధనా నిపుణులు చెబుతున్నారు.

News February 3, 2026

అడుగులోనే అరక విరిగిందట

image

పొలం దున్నడానికి ఉపయోగించే ముఖ్యమైన వ్యవసాయ పనిముట్టు అరక. పొలం దున్నడం మొదలుపెట్టి, ఒక అడుగు వేయకముందే లేదా మొదటి అడుగులోనే, ప్రధానమైన పనిముట్టు అయిన అరక విరిగిపోతే పని ముందుకు సాగదు. ఏదైనా ఒక కార్యాన్ని లేదా ప్రయత్నాన్ని ప్రారంభించిన తక్షణమే ఊహించని సమస్య లేదా అవాంతరం ఎదురై మొత్తం ప్రణాళిక లేదా ప్రయత్నం విఫలమైనప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు.