News November 3, 2024

మధ్యంతర భృతి ప్రకటించాలని జేఏసీ వినతి

image

AP: ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే 18 అంశాలను CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. హెల్త్ కార్డులు పని చేయడం లేదని, క్యాష్ లెస్ వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ₹25 వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలైనా చెల్లించాలని కోరారు.

Similar News

News November 25, 2025

ఆంజనేయుడే కాదు.. ఆయన తోక కూడా అంతే శక్తిమంతమైనది..

image

నారద పురాణం ప్రకారం.. ఆజన్మ బ్రహ్మచారి హనుమాన్ లాంగూలం(తోక) సాక్షాత్తు రుద్రుడి రూపమని చెబుతారు. అందుకే ఆయన తోకను కూడా పూజిస్తే కష్టాలు కానరాకుండా పోతాయని నమ్ముతారు. ‘పూర్వం, భీముడు కూడా ఆయన తోకను కదపలేకపోయాడు. తులసీదాస్ ‘హనుమాన్ బాహుక్’ స్తోత్రంతో హనుమ లాంగూల స్పర్శను కోరి తన బాధలను పోగొట్టుకున్నారు. లాంగూల స్తోత్ర పఠనం రోగాలు, కష్టాలను తగ్గించి శాంతిని ప్రసాదిస్తుంది’ అని పండితులు చెబుతారు.

News November 25, 2025

మలేషియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు SM బ్యాన్

image

16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా (SM) వాడకుండా నిషేధం విధించాలని మలేషియా నిర్ణయించింది. 2026లో ఇది అమల్లోకి రానుంది. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెదిరింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పిల్లలు SM వాడితే పేరెంట్స్‌కు ఫైన్ వేయాలని భావిస్తోంది. కాగా టీనేజర్లకు DEC నుంచి SMను నిషేధిస్తామని ఇటీవల ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇండియాలోనూ ఇలాంటి రూల్ అమలు చేయాలంటారా?

News November 25, 2025

‘అఖండ-2’ మూవీకి అరుదైన ఘనత!

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ సినిమాను అవధి భాషలోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయ్యే తొలి టాలీవుడ్ సినిమాగా నిలవబోతోందని పేర్కొన్నాయి. ఈ ఇండో-ఆర్యన్ భాషను UP, MPలోని పలు ప్రాంతాల్లో మాట్లాడుతారు. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కానుండగా వారణాసిలో CM యోగి గెస్ట్‌గా ఓ ఈవెంట్ నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.