News February 6, 2025
రేపు ‘జాక్’ టీజర్
డీజే టిల్లూతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’ సిినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర టీజర్ రేపు ఉదయం 11.07 గంటలకు విడుదల కానుంది. సిద్ధూ సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది.
Similar News
News February 6, 2025
మూడు విడతలుగా ‘అన్నదాత సుఖీభవ’: చంద్రబాబు
AP: పీఎం కిసాన్ పేరిట కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో రూ.14 వేలు కలిపి ‘అన్నదాత సుఖీభవ’ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఆర్థిక సాయాన్ని మూడు విడతలుగా ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే మూడు నెలల్లో ప్రజలకు అందాల్సిన పథకాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
News February 6, 2025
విద్యార్థినిపై అత్యాచారం.. నటి తీవ్ర ఆవేదన
అత్యాచారాలకు పాల్పడే వారికి జీవించే అర్హత లేదని BJP నేత, నటి కుష్బూ సుందర్ అన్నారు. తమిళనాడులో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు టీచర్లు <<15375607>>అఘాయిత్యానికి<<>> పాల్పడటంపై ఆమె ఆగ్రహించారు. ‘ఇళ్లలో, వీధుల్లో, విద్యా సంస్థల్లో, హాస్టళ్లలో ఎక్కడా పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. పిల్లలు, మహిళలపై ఇలాంటివి జరగకుండా ఆపాలి. ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్లను కఠినంగా శిక్షించి సమాజానికి ఓ హెచ్చరిక ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.
News February 6, 2025
Stock Markets: తప్పని నష్టాలు..
దేశీయ స్టాక్మార్కెట్లు నేడు నష్టపోయాయి. నిఫ్టీ 23,603 (-92), సెన్సెక్స్ 78,058 (-213) వద్ద క్లోజయ్యాయి. ఐటీ, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎక్కువ లాభపడ్డాయి. రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, మీడియా, మెటల్, ఎఫ్ఎంసీజీ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. సిప్లా, అదానీ పోర్ట్స్, ఐటీసీ హోటల్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ గెయినర్స్. ట్రెంట్, బీఈఎల్, ఎయిర్టెల్, టైటాన్, ఓఎన్జీసీ టాప్ లూజర్స్.