News August 5, 2024

హసీనా నివాసం నుంచి జాకెట్లు, లోదుస్తులు ఎత్తుకెళ్లారు!

image

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారిక నివాసంలో నిరసనకారులు ప్రవర్తించిన తీరుపై విమర్శలొస్తున్నాయి. ఆమె దుస్తులను దొంగలించిన యువకులు.. లోదుస్తులు, జాకెట్లను ఎత్తుకెళ్తూ కెమెరాలకు పోజులిచ్చారు. ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అక్కడ పెంచుతున్న కోళ్లు, ఇతర మూగజీవాలను సైతం తస్కరించారు. రిజర్వేషన్లపై నిరసన చేసేవారు ఇలా చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News January 6, 2026

GNT: నేడు సీఆర్డీఏ అథారిటీతో సీఎం సమావేశం

image

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులు ఇతర విషయాలపై CRDA అథారిటీతో CM చంద్రబాబు మంగళవారం సమావేశం కానున్నారు. ముందుగా మంత్రి నారాయణ CRDA అధికారులతో సమీక్ష నిర్వహించి, మధ్యాహ్నం 2:30 నిమిషాలకు సచివాలయంలో జరిగే అథారిటీ సమావేశంలో చర్చించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి రైతుల సమస్యల త్రిసభ్య కమిటీతో CM భేటి కానున్నారు. సాయంత్రం 4 గంటలకు తీసుకున్న నిర్ణయాలు మంత్రి నారాయణ వెల్లడిస్తారు.

News January 6, 2026

31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

image

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లులేని భక్తులకు దర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,650మంది భక్తులు దర్శించుకున్నారు. 23,331మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న రూ.4.08కోట్ల హుండీ ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.

News January 6, 2026

కిలో చికెన్ రూ.320.. మరింత పెరిగే అవకాశం!

image

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల చికెన్ ధర స్కిన్‌లెస్ కిలోకి రూ.320 వరకు ఉంది. చాలాకాలంగా పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉండటంతో చాలామంది కోళ్ల పెంపకాన్ని ఆపేశారు. డిమాండుకు తగ్గట్లు సప్లయ్ లేకపోవడం వల్లే ధరలు ఇంతలా పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అటు కోడిగుడ్డు ధర కూడా రూ.8గా ఉంది.