News March 29, 2025
వరుణ్ చక్రవర్తికి జాక్పాట్?

CTలో స్పిన్ మ్యాజిక్ చేసిన వరుణ్ చక్రవర్తికి BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. అలాగే గతంలో కాంట్రాక్టులు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ పేర్లను చేర్చడం ఖాయంగా కన్పిస్తోంది. మరోవైపు పలువురు ప్లేయర్లకు పదోన్నతి లభించే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ కాంట్రాక్టుల అంశంతో పాటు ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి ఇవాళ BCCI సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Similar News
News December 25, 2025
ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా

మృతకణాలు తొలగి ముఖం మెరవడానికి, ముఖంపై ఉండే దుమ్మూధూళీ తొలగించడానికి అప్పుడప్పుడూ ఫేస్ ప్యాక్ వేస్తూ ఉండాలి. అయితే ఫేస్ ప్యాక్స్ మంచివే కదా అని తరచూ వాడకూడదు. దీనివల్ల చర్మం పొడిబారిపోతుంది. అలాగే మార్కెట్లో కొని వాడే ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. ఫేస్ ప్యాక్ ఎక్కువసేపు ఉంచకూడదు. ఆరిన వెంటనే శుభ్రం చెయ్యాలి. కొత్త ఫేస్ ప్యాక్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.
News December 25, 2025
సంతూర్.. సంతూర్.. దేశంలో అతిపెద్ద సోప్ బ్రాండ్ ఇదే!

దేశంలో అతిపెద్ద సోప్ బ్రాండ్గా ‘Santoor’ నిలిచింది. ఏడాది కాలంలో ₹2,850 కోట్ల సబ్బుల సేల్స్ జరిగినట్లు ఇన్వాయిస్డ్ సేల్స్ డేటా వెల్లడించింది. ‘1986లో ₹60 కోట్ల ఆదాయం సాధించాం. లైఫ్బాయ్ను అధిగమించి దేశంలో No.1గా సంతూర్ నిలిచింది. ప్రజల అవసరాలపై అవగాహన, క్రమశిక్షణ, ఆకర్షణీయ యాడ్స్ ఈ విజయానికి కారణం’ అని విప్రో కన్జూమర్ ప్రొడక్ట్స్ CEO వినీత్ అగర్వాల్ చెప్పారు. మీరూ సంతూర్ మమ్మీ, డాడీనా? కామెంట్.
News December 25, 2025
‘శంబాల’ మూవీ రివ్యూ&రేటింగ్

ఆకాశం నుంచి ‘శంబాల’ గ్రామంలో ఉల్క పడిన తర్వాత ఏం జరిగిందనేదే కథ. సైన్స్, మూఢనమ్మకాలను లింక్ చేస్తూ థ్రిల్లింగ్ అంశాలతో డైరెక్టర్ యుగంధర్ కథను నడిపించారు. హీరో ఆది సాయికుమార్ నటనతో మెప్పించారు. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. శ్రీచరణ్ మ్యూజిక్ మూవీకి ప్లస్. VFXలో క్వాలిటీ లోపించింది. ఫస్టాఫ్ మరింత ఎడిట్ చేయాల్సింది. ఊహకందే కథనం, రొటీన్ క్లైమాక్స్ మైనస్.
రేటింగ్: 2.75/5


