News November 24, 2024

వెంకటేశ్ అయ్యర్‌కు జాక్‌పాట్

image

భారీ హిట్లు కొట్టగలిగే ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టారు. రూ.23.75 కోట్లకు KKR దక్కించుకుంది. బేస్ ప్రైజ్ రూ.2కోట్లతో వేలంలోకి వచ్చిన ఇతడి కోసం LSG, KKR, RCB పోటీ పడ్డాయి. ఐపీఎల్ కెరీర్‌లో ఇతను 137 స్ట్రైక్ రేట్‌తో 1326 రన్స్ చేశారు. ఒక సెంచరీ కూడా ఉంది. కొన్ని సీజన్లుగా వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

Similar News

News October 22, 2025

మల్లోజుల, ఆశన్నలకు ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ!

image

ఆయుధాలతో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాళ్లు నమ్మకద్రోహం చేశారని, శిక్ష తప్పదంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఇటీవల హెచ్చరిక లేఖ విడుదలైంది. దీంతో ఆ ఇద్దరు అగ్రనేతలకు ఏమైనా జరిగితే చెడ్డపేరు వస్తుందని, ఇతర మావోయిస్టుల లొంగుబాట్లకు ఇబ్బంది వస్తుందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

News October 22, 2025

కోళ్లలో కొరైజా రోగ లక్షణాలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కొరైజా రోగం సోకిన కోళ్లు సరిగా నీటిని, మేతను తీసికోక బరువు తగ్గుతాయి. కోడి ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుంది. కళ్లలో ఉబ్బి తెల్లని చీము గడ్డలు ఏర్పడతాయి. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశిస్తే అన్ని బ్యాచ్‌లకు ఈ రోగం వచ్చే ఛాన్సుంది. ఒక బ్యాచ్‌కు ఈ వ్యాధి వస్తే ఆ షెడ్డును కొన్ని రోజులు ఖాళీగా ఉంచాలి. సున్నం, గమాక్సిన్, బ్లీచింగ్ పౌడర్ కలిపి సున్నం వేయాలి. లిట్టరు పొడిగా ఉండేలా చూడాలి.

News October 22, 2025

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో ఉద్యోగాలు

image

ఎయిమ్స్ రాజ్‌కోట్‌ 26 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంబీబీఎస్ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 30 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1180, SC, STలకు రూ.944. వెబ్‌సైట్: https://aiimsrajkot.edu.in/