News March 28, 2024
జాక్‌పాట్: లాటరీలో రూ.9,400 కోట్లు గెలిచాడు..

అమెరికా లాటరీలో ఓ వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.9,400 కోట్లు గెల్చుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యారు. మెగా మిలియన్స్ అనే లాటరీ గేమ్‌లో మంగళవారం డ్రా తీశారు. అందులో ఒక వ్యక్తి ఆ మొత్తం గెల్చుకున్నారని గేమ్ అధికారులు తెలిపారు. అయితే అతడి పేరు వెల్లడించలేదు. కాగా జాక్‌పాట్ చరిత్రలో ఇది ఐదో అతిపెద్ద లాటరీ. విజేత మొత్తం డబ్బును ఒకేసారి లేదా 29 వార్షిక వాయిదాలలో పొందే అవకాశం ఉంది.
Similar News
News January 30, 2026
400 మీటర్లకు రూ.18వేల ఛార్జ్.. ఆటో డ్రైవర్ అరెస్ట్

అర్జెంటీనా అరియానో అనే అమెరికన్ టూరిస్ట్‌కు ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టు నుంచి 400 మీటర్ల దూరంలోని హోటల్‌కు తీసుకెళ్లడానికి ఆటోడ్రైవర్ ఏకంగా ₹18,000 తీసుకున్నట్లు ఆటో నంబర్ రికార్డు చేసి మరీ Xలో పోస్ట్ చేశారు. చాలాసేపు ఆటోలో తిప్పాడని, పైగా మధ్యలో ఆపి డబ్బిచ్చిన తర్వాతే హోటల్లో దిగబెట్టాడని తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు అతణ్ని దేశ్రాజ్ యాదవ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.
News January 30, 2026
T20WCలో 300 స్కోర్.. ఆ రెండు జట్లకు సాధ్యమే: రవిశాస్త్రి

T20WCలో 300 పరుగుల మార్క్‌ను భారత్, ఆస్ట్రేలియాలు సాధించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఆ జట్లలో విధ్వంసకర ప్లేయర్లు ఉన్నారని, టాపార్డర్‌లో ఒకరు సెంచరీ చేస్తే టీమ్ స్కోర్ 300కు చేరుతుందని పేర్కొన్నారు. కాగా T20WCలో శ్రీలంక అత్యధికంగా 260/6 స్కోర్ చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ENG(230), SA(229), IND(218) ఉన్నాయి. T20Iలలో ZIM 344, NEP 314, ENG 304 రన్స్ చేశాయి.
News January 30, 2026
నేను వెళ్లను.. పుతిన్‌నే రమ్మనండి: జెలెన్స్కీ

శాంతి చర్చల కోసం మాస్కోకు రావాలంటూ <<18997519>>రష్యా పంపిన ఆహ్వానాన్ని<<>> ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరించారు. ‘ట్రంప్, పుతిన్‌ను కలిసేందుకు నేను రెడీ. రష్యా తప్ప ఏ దేశానికైనా చర్చలకు వెళ్తా. నేనే పుతిన్‌ను కీవ్‌కు ఆహ్వానిస్తున్నా. ఆయన్ను రానివ్వండి.. అదీ ధైర్యం చేయగలిగితే’ అని అన్నారు. తాము యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నామని, ఉద్రిక్తతలను తగ్గించే చర్యలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.


