News March 10, 2025

రిటైర్మెంట్ వార్తలు.. స్పందించిన జడేజా

image

వన్డేలకు తాను రిటైర్మెంట్ ప్రకటిస్తానని జరుగుతున్న ప్రచారంపై టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఖండించారు. తన రిటైర్మెంట్‌పై వస్తున్న రూమర్స్ నమ్మవద్దని అభిమానులను కోరాడు. థాంక్స్ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీంతో తదుపరి వరల్డ్ కప్ వరకు జడ్డూ భారత జట్టుకు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 10, 2025

ఇళ్లు కట్టుకునే వారికి GOOD NEWS

image

AP: ఇళ్లు కట్టుకునే SC, ST, BC లబ్ధిదారులకు అదనపు సాయం చేయడంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50,000, STలకు రూ.75వేలు, గిరిజనులకు రూ.1లక్ష సాయం అందనుంది. PMAY(అర్బన్, గ్రామీణ్) బీఎల్సీ-1.0 కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకు సాయం లభించనుంది. దీనికి తోడు SHG సభ్యులకు జీరో వడ్డీపై రూ.35వేల రుణం, ఉచిత ఇసుక, ఇసుక రవాణాపై రూ.15వేలు అందిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.

News March 10, 2025

లవ్ హార్మోన్ పెంచే ఫుడ్స్ ఇవే..

image

సంతోషం, ప్రేమ కలిగినప్పుడు మెదడు విడుదల చేసే ఆక్సిటోసిన్‌ను లవ్ హార్మోన్ అని పిలుస్తుంటారు. దీనిని ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు డీ, సీ విటమిన్లు, మెగ్నీషియం మినరల్, ఒమెగా 3 వంటి హెల్తీ ఫ్యాట్స్ సాయం చేస్తాయి. సాల్మన్, మాకెరల్, టూనా వంటి చేపలు, అవకాడో, ఆరెంజెస్, నిమ్మ, ఆకుకూరలు, డార్క్ చాక్లెట్, గుడ్లు, డ్రై ఫ్రూట్స్‌లో పైన చెప్పినవి పుష్కలంగా దొరుకుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం!

News March 10, 2025

ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని రామ్మోహన్ లేఖ

image

AP: శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. తన నియోజకవర్గం శ్రీకాకుళంలో 197కి.మీ సముద్ర తీర ప్రాంతం ఉందని, 230కి పైగా గ్రామాల ప్రజలు మత్స్య సంపదపైనే ఆధారపడి ఉన్నారని వివరించారు. సంతబొమ్మాళి(మ) భావనపాడు గ్రామం వద్ద ఫిషింగ్ పోర్ట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!