News January 24, 2025
12 వికెట్లు తీసిన జడేజా

రంజీల్లో ఓ వైపు భారత స్టార్ బ్యాటర్లు విఫలమవుతుండగా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన ఆల్రౌండర్ జడేజా అదరగొట్టారు. ఢిల్లీతో జరిగిన మ్యాచులో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి ఏకంగా 12 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్సులో 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. బ్యాటుతోనూ రాణించి 38 పరుగులు చేశారు. ఈ మ్యాచులో సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Similar News
News November 15, 2025
PGIMERలో 151 పోస్టులు

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (<
News November 15, 2025
హనుమాన్ చాలీసా భావం – 10

భీమరూప ధరి అసుర సంహారే | రామచంద్ర కే కాజ సంవారే ||
ఆంజనేయుడు భయంకరమైన, భీకరమైన రూపాన్ని ధరించి, శక్తివంతమైన రాక్షసులను సంహరించాడు. తన సొంత ప్రయోజనం కోసం కాకుండా, శ్రీ రామచంద్రుడను నమ్మి ఆయన ముఖ్య కార్యాలను విజయవంతంగా పూర్తి చేశాడు. ఎంతటి శక్తి ఉన్నా.. ఆ బలాన్ని ఉత్తమ ధర్మాన్ని నిలబెట్టడానికి, దైవ కార్యాలను నెరవేర్చడానికి మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే మన జీవిత లక్ష్యం నెరవేరుతుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 15, 2025
ఈ ఊరి ప్రజలు తిరుమలకు వెళ్లరు.. ఎందుకంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోని ఓ ఊరు ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లా(TG) మల్దకల్ ప్రజలు తిరుమలకు వెళ్లరు. దీనికి కారణం ఆ ఊరిలోనే వెలసిన స్వయంభు లక్ష్మీవేంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) ఆలయం. తమ స్థానిక దైవమైన తిమ్మప్పనే తిరుమలేశుడిగా భావించి పూజిస్తారు. ఇక్కడ ఏటా డిసెంబర్ నెల పౌర్ణమి రోజున తిరునాళ్లు నిర్వహిస్తారు. ప్రజలు తమ ఇళ్లను ఆలయ గోపురం కంటే ఎత్తుగా నిర్మించరు.


