News April 6, 2024
ఐపీఎల్లో జడేజా పేలవ ప్రదర్శన!
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నిరాశపరుస్తున్నారు. వేగంగా పరుగులు చేయాల్సిన సమయంలో తేలిపోతున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఇదే జరిగింది. ఇవాళ SRHతో జరిగిన మ్యాచ్లోనూ 4 ఓవర్లు ఆడి 31 పరుగులే చేశారు. అటు బౌలింగ్లోనూ తన మార్క్ చూపించలేకపోతున్నారు. దీంతో జడేజాకు ఏమైందంటూ ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
Similar News
News February 5, 2025
ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్!
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు తెలిపాయి. మరో వైపు హజిల్వుడ్ తన ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. కమిన్స్ స్థానంలో స్మిత్ లేదా హెడ్ సారథ్య బాధ్యతలు స్వీకరించే అవకాశమున్నట్లు సమాచారం. జట్టు మేనేజ్మెంట్ నుంచి ఈ విషయమై ప్రకటన రావాల్సి ఉంది.
News February 5, 2025
కులగణన సర్వేలో మళ్లీ వివరాలివ్వొచ్చు: మంత్రి పొన్నం
TG: కులగణన సర్వేలో పాల్గొనని వారు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. అన్ని వర్గాలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తప్పుడు వార్తల వ్యాప్తి బలహీన వర్గాలపై దాడేనని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై వైఖరి ఏంటో ప్రతి పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించాలని అనుకుంటే ఎదుర్కొంటామని చెప్పారు.
News February 5, 2025
పెళ్లి కార్డు ఇన్విటేషన్ అదిరిపోయిందిగా..
పెళ్లి వేడుకలకు ఆహ్వానించేందుకు యువ జంటలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆధార్ కార్డు ఇన్విటేషన్ మరవకముందే కేరళలో ఓ జంట రేషన్ కార్డు తరహాలో వెడ్డింగ్ కార్డును రూపొందించారు. వరుడు ‘రేషన్ షాప్ బాయ్’గా స్థానికంగా పాపులర్ అవడంతో పెళ్లి కూతురు ఇలా డిజైన్ చేయించిందని సమాచారం. వీరి పెళ్లి ఈ నెల 2న జరిగింది. ఈ కార్డు వైరలవ్వగా క్రియేటివిటీ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.