News March 25, 2024
జగదీశ్ రెడ్డి 1.50 లక్షల ఎకరాలు దోచుకున్నారు: వేముల వీరేశం

TG: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు. జగదీశ్, ఆయన అనుచరులు నల్గొండ జిల్లాలో 1.50 లక్షల ఎకరాలను దోచుకున్నారని విమర్శించారు. ఆ భూములు ఉన్న గ్రామాలు, సర్వే నంబర్లతో నిరూపించడానికి తాను సిద్ధమని తెలిపారు. కొల్లగొట్టిన భూములను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ భూముల వ్యవహారంపై త్వరలో సీఎం రేవంత్‌కు లేఖ రాస్తానని చెప్పారు.
Similar News
News November 24, 2025
కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CM

AP: అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే’ అని స్పష్టం చేశారు.
News November 24, 2025
టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై రవిశాస్త్రి ఫైర్

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఫైరయ్యారు. రెండో టెస్టులో సుందర్‌ను ఎనిమిదో స్థానంలో పంపడం సరికాదన్నారు. ఈ ఆలోచన అర్థం లేనిదని మండిపడ్డారు. కోల్‌కతా(తొలి) టెస్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించి, వారిలో ఒకరికి ఒకే ఓవర్ ఇవ్వడమూ సరైన నిర్ణయం కాదన్నారు. కనీసం స్పెషలిస్టు బ్యాటర్‌తో వెళ్లి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
News November 24, 2025
అద్దె ఇంట్లో ఏ దిశన పడుకోవాలి?

సొంత ఇల్లు/అద్దె ఇల్లు.. అది ఏదైనా ఆరోగ్యం కోసం తల దక్షిణ దిశకు, పాదాలు ఉత్తర దిశకు పెట్టి నిద్రించడం ఉత్తమమని వాస్తు శాస్త్రం చెబుతోందని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు తెలుపుతున్నారు. ‘ఈ దిశలో నిద్రించడం అయస్కాంత క్షేత్రాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దక్షిణ దిశలో నిద్రించడం సదా ఆరోగ్యకరమైన అలవాటు. తూర్పు దిశలో తలపెట్టి పడుకోవడం కూడా ఉత్తమమే’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


