News October 29, 2024
జైల్లో పెట్టినా ప్రశ్నించడం ఆగదు: జగదీశ్ రెడ్డి

TG: ప్రభుత్వ తీరుతో ఇంట్లో దావత్ చేసుకోవాలన్నా ప్రజలు భయపడుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తమను జైల్లో పెట్టినా ప్రశ్నించడం ఆగదని మండిపడ్డారు. కేసీఆర్, మా ఇంటి మీద బాంబులు వేసి చంపుతారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంతో కొట్లాడి విద్యుత్ బాంబును ఆపేశామన్నారు. రోడ్ల ప్రైవేటైజేషన్ బాంబును కూడా ఆపి, ప్రజలను రక్షిస్తామని చెప్పారు.
Similar News
News December 15, 2025
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, వాచ్మన్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి 7వ తరగతి, డిగ్రీ, పీజీ (MSW/MA-రూరల్ డెవలప్మెంట్/సోషియాలజీ/సైకాలజీ) BEd ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 22-40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://centralbank.bank.in/
News December 15, 2025
ఒక్క ఓటుతో సర్పంచ్ పీఠం

TG: హోరాహోరీగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు ఒక్క ఓటుతో గెలిచారు. కరీంనగర్ జిల్లాలోనే ఐదుగురు ఇలా సర్పంచ్ పీఠం ఎక్కారు. కొత్తపల్లిలో శోభారాణి, పెద్దూరుపల్లిలో రామడుగు హరీశ్, మహాత్మనగర్లో పొన్నాల సంపత్, ముంజంపల్లిలో నందగిరి కనక లక్ష్మి, అంబల్ పూర్లో వెంకటేశ్ ఓటు తేడాతో విజయం సాధించారు. వరంగల్(D) ఆశాలపల్లి కొంగర మల్లమ్మ, నల్గొండ(D) ధన్సింగ్ తండాలో ధనావత్ కూడా ఇలా గెలిచారు.
News December 15, 2025
సీడ్ పార్కు… 100 విత్తన ఉత్పత్తి కేంద్రాలు

TG: విత్తన ఉత్పత్తి, ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చేలా ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా సీడ్ రీసెర్చ్ పార్కు నెలకొల్పనుంది. అలాగే కొత్తగా 100 విత్తన ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేయనుంది. వీటిలో 25 లక్షల టన్నుల అధిక నాణ్యత గల విత్తనాలను ఉత్పత్తి చేయనుంది. ఎగుమతి కోసం ‘Inland seed Export facilitation port’నూ నెలకొల్పనున్నట్లు TG రైజింగ్ డాక్యుమెంట్లో తెలిపింది.


