News September 26, 2024

జగన్.. తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకోండి: మంత్రి అచ్చెన్న

image

AP: తిరుమల కొండను అపవిత్రం చేసిన పాపం జగన్‌ను ఊరికే వదలదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘జగన్.. శిశుపాలుడిలా మీ నూరు తప్పులు పూర్తయ్యాయి. ఇప్పటికైనా ఆ భగవంతుడి ముందు తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకుని పూజలు చేయండి. చేసిన పాపానికి కొంతైనా పరిహారం దొరుకుతుంది’ అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా పథకాలు ఆపడం లేదన్నారు. అనర్హులు పథకాలు పొందకుండా కట్టడి చేస్తామన్నారు.

Similar News

News November 24, 2025

ఒంగోలు: క్రికెట్ తెచ్చిన కుంపటి.. 12 మందిపై కేసు నమోదు!

image

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగమూరు రోడ్డులో క్రికెట్ కారణంగా ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరువురి ఫిర్యాదు మేరకు 12 మంది పై కేసు నమోదు చేసినట్లు ఒంగోలు తాలూకా సీఐ విజయ్ కృష్ణ తెలిపారు. ఆదివారం మంగమూరు రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న రెండు బ్యాచ్‌లలో విభేదాలు తలెత్తి ఒక్కసారిగా ఘర్షణ పడ్డారు. దీంతో రెండు జట్లకు చెందిన 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 24, 2025

మెనోపాజ్‌లో ఎముకలు జాగ్రత్త

image

ప్రతి స్త్రీ జీవితంలో మెనోపాజ్ స్థితి ఒకటి. అయితే ఈ క్రమంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా క్యాల్షియం, డి విటమిన్‌ లోపాలు ఎముకల్ని బలహీనంగా మారుస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి మెనోపాజ్‌ దశలో స్త్రీలు తమ రోజువారీ ఆహారంలో సుమారు 1200 మి.గ్రా క్యాల్షియంను అదనంగా తీసుకోవాలి. అలానే, పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే డైట్‌ని తీసుకోవాలంటున్నారు.

News November 24, 2025

ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

image

TG: హైదరాబాద్ శామీర్‌పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.