News April 7, 2024

మరో 2 నెలల్లో మళ్లీ ‘జగన్ అనే నేను’: వైఎస్ జగన్

image

AP: మరో 2 నెలల్లో మళ్లీ ‘జగన్ అనే నేను’ అంటూ తాను ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘అధికారాన్ని చంద్రబాబు దోచుకోవడానికి ఉపయోగించాడు. నేను సంక్షేమానికి వినియోగించాను. ప్రతి గ్రామంలో మా సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే. ఇలాంటి మోసగాళ్ల బారి నుంచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా’ అంటూ ప్రశ్నించారు.

Similar News

News January 25, 2026

చరిత్ర, ప్రకృతి, ప్రగతిల సమాహారం.. మన పెద్దపల్లి!

image

పెద్దపల్లి జిల్లా అరుదైన చారిత్రక, భౌగోళిక విశిష్టతలకు నిలయం. 12వ శతాబ్దంలో కాకతీయుల రెండో రాజధానిగా వెలిగిన రామగిరి ఖిల్లా, ప్రాచీన ధూళికట్ట బౌద్ధ స్థూపం ఇక్కడ జిల్లా ఘనతను చాటుతున్నాయి. గోదావరి, మానేరు నదుల కలయికతో పాటు, రాజధాని దాహార్తిని తీర్చే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇక్కడే ఉంది. అటు ఎన్టీపీసీ వెలుగులు, ఇటు సింగరేణి నల్లబంగారంతో ఈ జిల్లా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది.

News January 25, 2026

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ ధర ₹290-300, కామారెడ్డిలో ₹280, వరంగల్‌లో ₹290గా ఉంది. విశాఖలో ₹280, తిరుపతిలో ₹240-270, నంద్యాలలో ₹240-280 చిత్తూరు, బాపట్ల, గుంటూరులో ₹280-300, విజయవాడలో ₹310-330 వరకు పలుకుతోంది. ఇక కిలో మటన్ ధర ₹800-1000 వరకు ఉంది. మీ ప్రాంతంలో రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News January 25, 2026

NHAIలో 40 పోస్టులు.. అప్లై చేశారా?

image

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో 40 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్(సివిల్) అర్హతగల వారు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గేట్ -2025 స్కోరు ఆధారంగా ఎంపిక చేయనున్నారు. బేసిక్ పే రూ.56,100-రూ.1,77,500గా ఉంది. వెబ్‌సైట్: https://nhai.gov.in/