News February 25, 2025

జోకర్‌గా జగన్.. జనసేన ఎమ్మెల్యే సెటైర్

image

AP: ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా జగన్ ఓ జోకర్‌గా మిగిలారని జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తోన్న ఆయన.. ప్రజా తీర్పును గౌరవించలేదని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు.

Similar News

News January 21, 2026

ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్న చాహల్, మహ్వాశ్!

image

భార్య ధనశ్రీతో విడాకుల తర్వాత IND క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రేడియో జాకీ, ఇన్‌ఫ్లుయెన్సర్ RJ మ‌హ్వాశ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా వీరి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే SMలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారని సమాచారం. పలుమార్లు వీరిద్దరూ కలిసి కనిపించడం, IPL మ్యాచుల వేళ గ్రౌండ్‌లో చాహల్‌ను ఆమె ఎంకరేజ్ చేయడంతో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

News January 21, 2026

రాజాసాబ్ ఫెయిల్యూర్‌కి అదే కారణం: తమ్మారెడ్డి

image

ప్రభాస్ ‘రాజాసాబ్’ను రూ.100 కోట్లతో రీజినల్ ఫిల్మ్‌గా తీసుంటే లాభాలు వచ్చేవని సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ‘ఈ మూవీని తొలుత తక్కువ బడ్జెట్‌లో తెలుగులో తీయాలనుకున్నారు. తర్వాత పాన్ ఇండియా ఆలోచనతో పదే పదే స్క్రిప్ట్ మార్చారు. దీంతో మొదట అసలు కథ తెరకెక్కలేదు. మేకర్స్‌కు పాన్ ఇండియా ఆలోచన వస్తే చేసే మార్పులు కొన్నిసార్లే సక్సెస్ ఇస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

News January 21, 2026

స్మార్ట్ ఫోన్ యూజర్లకు త్వరలో కొత్త ఫీచర్!

image

గూగుల్ ఫొటోస్ యాప్‌లో మీడియా ఫైల్స్ బ్యాకప్ చేసినప్పుడు ఫోన్ ఛార్జింగ్ ఎక్కువగా అయిపోతుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే సింకింగ్, ఆపరేషన్సే దీనికి కారణం. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ యాప్‌లో త్వరలో ‘ఆప్టిమైజ్ బ్యాకప్ ఫర్ బ్యాటరీ లైఫ్’ అనే ఫీచర్ రానుంది. ఇది అనవసరమైన సింకింగ్‌ను తగ్గించి బ్యాటరీ లైఫ్‌ను పెంచుతుంది. యాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా ఫోన్ వాడనప్పుడు మాత్రమే బ్యాకప్ జరుగుతుంది.