News February 24, 2025

జగన్ అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారు: అచ్చెన్నాయుడు

image

AP: జగన్, YCP MLAలు అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారని, ప్రజల కోసం కాదని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందని, ఉపఎన్నికలు వస్తే 11సీట్లు కూడా రావనే భయంతో వచ్చారన్నారు. అవినీతి నుంచి పుట్టిన పార్టీ YCP అని మండిపడ్డారు. ఓ పేపర్, టీవీని అడ్డం పెట్టుకొని చెప్పిన అబద్ధాలే చెప్పి చెప్పి నమ్మించాలని చూస్తే ఏమయిందో మొన్నటి ఎన్నికల్లో చూశామన్నారు.

Similar News

News February 24, 2025

3 రోజుల పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీని ఎస్సీ, ఎస్టీ కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే ఆయనను విచారించాలని ఆదేశించింది. ఉదయం, సాయంత్రం మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. వంశీకి వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

News February 24, 2025

ఓటీటీలోకి కొత్త సినిమా

image

అజిత్, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విదాముయార్చి’(పట్టుదల) మార్చి 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్వీట్ చేసింది. మగిజ్ తిరుమేని తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి రానుంది.

News February 24, 2025

పవన్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే: అంబటి

image

AP: ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే YS జగన్ <<15563014>>జర్మనీకి వెళ్లాలన్న<<>> Dy.CM పవన్‌కు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే’ అని సెటైర్ వేశారు. గోవాలో 40 స్థానాలుండగా 21 మ్యాజిక్ ఫిగర్. ఏపీలో 21 స్థానాలను జనసేన గెలిచిన విషయం తెలిసిందే. ఈ సీట్లతో పవన్ ఏపీలో ఎప్పటికీ సీఎం కాలేడనే అర్థంలో ఆయన ట్వీట్ చేశారు.

error: Content is protected !!