News November 1, 2024

ఆ విషయంలో జగన్‌కు ఆస్కార్ ఇవ్వొచ్చు: నిమ్మల

image

AP: ప్రపంచంలో తల్లిని, చెల్లిని మోసం చేసిన జగన్ లాంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించరని మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదన్నారు. పోలవరం ఎత్తుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ ఇవ్వొచ్చని చురకలంటించారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది జగన్ కాదా అని నిలదీశారు.

Similar News

News November 1, 2024

కలకలం: వారంలోనే 10 ఏనుగులు మృత్యువాత

image

MP బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్(BTR)‌లో ఈ వారంలోనే 10 ఏనుగులు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. వీటి మరణాలకు సంబంధించి అనుమానాస్పదంగా ఏమీ కనిపించడం లేదని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంబాదే తెలిపారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదిక తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ ఘటనలపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీకి చెందిన వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారులతో కమిటీని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు.

News November 1, 2024

అరుదైన రికార్డు ముంగిట అశ్విన్

image

NZతో ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో ఓ అరుదైన రికార్డుపై అశ్విన్ కన్నేశారు. ఈ మ్యాచ్‌ ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీస్తే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధికసార్లు ఐదు వికెట్లు కూల్చిన ప్లేయర్‌, ఓవరాల్‌గా నాలుగో ప్లేయర్‌గా నిలుస్తారు. ప్రస్తుతం కుంబ్లే, అశ్విన్ చెరో 37 సార్లు ఐదు వికెట్లు పడగొట్టారు. ఈ జాబితాలో మురళీధరన్(77), రిచర్డ్(41), షేన్ వార్న్(38) తొలి 3 స్థానాల్లో ఉన్నారు.

News November 1, 2024

నవంబర్ 1: చరిత్రలో ఈరోజు

image

✒ 1897: ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి జననం
✒ 1956: ఉమ్మడి ఏపీతో పాటు కేరళ, మైసూరు, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల ఆవిర్భావం
✒ 1959: APలో పంచాయతీ రాజ్ వ్యవస్థ మొదలు
✒ 1966: పంజాబ్, హరియాణా రాష్ట్రాల ఏర్పాటు
✒ 1973: మైసూరు రాష్ట్రం పేరు కర్ణాటకగా మార్పు
✒ 1974: మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ జననం
✒ 1986: హీరోయిన్ ఇలియానా జననం
✒ 1989: అలనాటి హీరో హరనాథ్ మరణం